
తాజా వార్తలు
1. నల్లాకూ ఆధార్ లింకు!
తెలంగాణలోని భగీరథ పథకం మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకురానుంది. ఇందుకోసం పలు నిబంధనలు విధించింది. నిబంధనల ప్రకారం ప్రతి నల్లా కనెక్షన్‌కు ఇంటి యజమాని ఆధార్ ఆనుసంధానం కావాలి. జియో ట్యాగింగ్ తప్పనిసరి. ఖర్చులో 50 శాతాన్ని రాష్ట్రం భరించాలి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రూ.20వేలూ తల్లి ఖాతాలోకే
‘జగనన్న విద్యా వసతి’ పథకం కింద వసతి, ఆహార ఖర్చులకు ఏటా ఇవ్వబోతున్న రూ.20వేల ఆర్థిక సాయాన్ని సంబంధిత విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద సంక్షేమ వసతి గృహాలు, కళాశాలల అనుబంధ వసతి గృహాల్లో ఉండి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకూ సాయం అందిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. తెలంగాణలో తెలుగే ముద్దు
ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే జరగాలని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రైవేటులోనూ ఇదే విధానం అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సూచించడం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పదో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా చదవాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీఓ జారీ చేసింది. ఒక వైపు తెలుగు తప్పనిసరంటూ.. మరోవైపు ఆంగ్ల మాధ్యమాన్ని రుద్దడం మంచిది కాదన్నది విద్యాశాఖ ఉద్దేశం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కొత్తగా మరో 150 పంచాయతీలు
నిషేధం తొలగింపుతో రాష్ట్రంలో కొత్తగా మరో 150 పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమం కానున్నది. ఈ మేరకు జిల్లాల నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతిపాదనలను అధికారులు బయటకు తీస్తున్నారు. ఎన్నికల ముందు 2వేల జనాభా కలిగిన గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీల సంఖ్య 13,053కి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మున్సిపల్ ఎన్నికలకు తొలగని అడ్డంకులు!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సుమారు 77 పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. దీంతో ఆయాచోట్ల ఎన్నికలు నిర్వహించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. వేర్వేరుగా దాఖలైన పటిషన్లపై వేర్వేరుగా విచారణ చేపడితే ధర్మాసనం వెలువరించిన తీర్పు వర్తిస్తుందో లేదో చెప్పవచ్చని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6.ప్రైవేటీకరణకు పచ్చజెండా
మునుపెన్నడూ లేనంత భారీస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రైవేటీకరణకు పచ్చజెండా చూపింది. ప్రభుత్వరంగ చమురు సంస్థల్లో రెండో అతిపెద్దదిగా నిలిచే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)తో పాటు, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)లో, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)లలో ప్రభుత్వ వాటాలు విక్రయించడానికి ఆమోదం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. చెరో రెండున్నరేళ్లు!
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు చేరువ అవుతున్నట్లుగా శివసేన, ఎన్సీపీ నేతలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా వాటి మధ్య అవగాహన కుదిరిందని, ఉపముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. సుప్రీంకోర్టు ప్రతిష్ఠపై తక్షణం దృష్టి పెట్టండి
సుప్రీంకోర్టు గౌరవ ప్రతిష్ఠల పునరుద్ధరణకు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే (సీజేఐ) సత్వర చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయవ్యవస్థ స్వతంత్రతకు వినాశనం తప్పదని సర్వోన్నత న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుర్ హెచ్చరించారు. ఇటీవల తీసుకున్న కొన్ని పరిపాలనపరమైన నిర్ణయాలు, ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్య చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఎగవేస్తే.. వెల్లడించాల్సిందే
మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ మదుపర్ల ప్రయోజనాల నిమిత్తం పలు నిర్ణయాలు తీసుకుంది. నమోదిత కంపెనీలకు వెల్లడి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా ఏదైనా కంపెనీ రుణ ఎగవేతకు పాల్పడితే 24 గంటల్లోగా అందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో నివేదికను సమర్పించాలి. స్తుతం అగ్రగామి 500 కంపెనీలు మాత్రమే తప్పనిసరిగా వ్యాపార బాధ్యతా నివేదికలు(బీఆర్లు) సమర్పించాలి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. విశ్రాంత ఉద్యోగిని ముంచిన ఫేస్బుక్ స్నేహం
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘ఎలక్షన్.. ఎలక్షన్‌కి పవర్ కట్ అయిపోద్ది రా..’
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- సానియా మీర్జాతో చరణ్ చిందులు
- హీరోయిన్లను పిలవగానే బాలయ్య ఏం చేశారంటే..
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
