close

తాజా వార్తలు

మాటువేసి.. మింగేసి..

ఆకలితో నకనకలాడుతున్న ఓ పసిరిక పాము.. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అరటి తోటలోకి ప్రవేశించింది.. చాలాసేపటివరకు గాలించినా చిన్న కీటకం కూడా కంటికి కనిపించలేదు.. అంతకంతకూ పెరుగుతున్న క్షుద్బాధ పేగులను మెలితిప్పుతోంది.. బతకాలంటే ఏదో ఒక జీవిని తినక తప్పని పరిస్థితి. దీంతో ఓ అరటి చెట్టుపై మాటువేసింది. సరిగ్గా అదేసమయంలో దానికి ఓ బిందెల పాము (నాలుగు కాళ్ల పాము) కనిపించింది.. ఏ మాత్రం జాప్యం చేయకుండా నోట కరిచి చెట్టుపైకి లాక్కెళ్లింది.. పది నిమిషాల వ్యవధిలో దాన్ని అమాంతం మింగేసిన పసిరిక పాము మెల్లగా పొదల్లోకి జారుకుంది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గ్రామమైన ముంజులూరులో బుధవారం ఈ దృశ్యం కనిపించింది.

- న్యూస్‌టుడే, బుట్టాయగూడెం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.