
తాజా వార్తలు
ఈ చిత్రంలో పడుకొని ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మర్రిగూడ గ్రామానికి చెందిన కొత్త రమేష్. గీత కార్మికుడైన ఇతను ఎనిమిదేళ్ల క్రితం తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. దీంతో రెండు కాళ్లతో పాటు వెన్నెముక దెబ్బతింది. ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు. కనీసం కూర్చునే అవకాశం కూడా లేదు. నాలుగెకరాల పొలం ఉన్నప్పటికీ సాగు చేయలేని స్థితి. భార్య, కూలీల సహాయంతో సాగు పనులు చేయిస్తున్నాడు. పొలం, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాన్ని తయారు చేయించుకున్నాడు. ఇందుకోసం మూడు చక్రాల మోపెడ్‌ను కొనుగోలు చేసి పడుకోవడానికి వీలుగా బెడ్‌ను ఏర్పాటు చేశాడు. దాని మీద పడుకొని ఆ వాహనాన్ని నడుపుతున్నాడు. ఇలా వెళ్లడం కష్టంగా ఉన్నా తప్పడం లేదంటున్నాడు. తనకు ఇంటర్, 10, 9 చదువుతున్న ముగ్గురు కుమార్తెలున్నారని.. ప్రభుత్వం సహాయం అందిస్తే మరింత ఆత్మవిశ్వాసంతో బతుకుతానని రమేష్ వేడుకుంటున్నాడు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రజనీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి
- రాహుల్‌కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
- పౌరసత్వ చట్టంతో కాంగ్రెస్‌కు కడుపునొప్పి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
