close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఏపీలో ఆంగ్లమాధ్యమంపై జీవో విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి ఒక్కో తరగతిలో ఆంగ్లమాధ్యమాన్ని పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. శబరిమలకు కొత్త చట్టం చేయండి: సుప్రీం

శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి మూడో వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేరళలోని ఇతర ఆలయాలతో కలిపి చట్టం తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పండలం రాజ కుటుంబం వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఆర్టీసీ సమ్మెపై కీలక ప్రకటన?

ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు ఎంజీబీఎస్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతి, భవిష్యత్ కార్యాచరణపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. సమ్మెపై ఐకాస నేతలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సాయంత్రం మరోసారి సమావేశమై సమ్మెపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సమ్మెను కొనసాగింపు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

4. సాధారణంగానే కశ్మీర్‌ పరిస్థితులు

ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్‌ అంశంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా అమిత్ షా ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకే ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశామని, త్వరలోనే వాటిని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. తెరాస ఏజెంట్‌గా సునీల్‌శర్మ: విపక్ష నేతలు

ఆర్టీసీ సమ్మె పరిష్కారంపై చొరవ చూపాలని కోరుతూ విపక్ష నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అఫిడవిట్‌ సమర్పించిన ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మపై చర్యలు తీసుకోవాలని నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, కేంద్రమంత్రులను కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం:వాట్సప్‌

భారత్‌లోని ప్రముఖుల ఫోన్లపై పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా జరిగిన సైబర్‌ దాడి విషయంలో ప్రభుత్వంతో కలిసి మరింత లోతుగా పనిచేయాల్సిందని వాట్సప్‌ అభిప్రాయపడింది. భారత పౌరుల వ్యక్తిగత గోప్యతను కాపాడడంలో మున్ముందు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చింది. భారత్‌లోని 400 మిలియన్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు సంస్థ కట్టుబడి ఉందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఎన్నార్సీపై యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ ఆందోళన..!

అసోం జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) ప్రక్రియపై అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడమ్‌(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. దీని ద్వారా దాదాపు 20లక్షల మంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. సరైన నియంత్రణ, పారదర్శకత లేని ఒక ప్రక్రియ ద్వారా లక్షల మందికి పౌరసత్వం లభించకుండా చేయబోతున్నారని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ కమిషనర్‌ అనురిమా భార్గవ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. మున్సిపల్‌ పిటిషన్లన్నింటిపై విచారణ: హైకోర్టు

మున్సిపల్‌ ఎన్నికల కేసులపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా పిటిషన్లన్నీ కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇప్పటికే అభ్యంతరాలను సీజే ధర్మాసనం తోసిపుచ్చిందన్న ప్రభుత్వం... పిటిషనర్లకు అభ్యంతరాలుంటే ఇప్పటికైనా అధికారులను సంప్రదించవచ్చని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రికార్డులను తాకి.. వెనక్కి..

 నేటి ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డులను తాకిన సూచీలు ఆ తర్వాత లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చాయి. 250 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 40,816 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అటు నిఫ్టీ కూడా 12వేల మార్క్‌ పైన కదలాడింది. సెన్సెక్స్‌ 181.94 పాయింట్లు లాభపడి 40,651.64 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 11,999.10 వద్ద స్థిరపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘రియల్‌మీ’ కొత్త ఫోన్ల విడుదల 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.