close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. దేవిక.. అవినీతి ఏలిక

బీమా, వైద్య సేవల విభాగం(ఐఎంఎస్‌) కుంభకోణంలో ఎన్నో సిత్రాలు బయపడుతున్నాయి. ఐఎంఎస్‌ అధికారులు సొంతంగా డొల్ల కంపెనీలు స్థాపించుకుని పెద్దఎత్తున లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఐఎంఎస్‌ సంచాలకులు దేవికారాణి ఒక్కరే ఏకంగా 38 కంపెనీలు స్థాపించినట్లు తెలుస్తోంది. తన అనుయాయులతో స్థాపించిన డొల్ల కంపెనీల ద్వారా పెద్దఎత్తున లావాదేవీలు జరిపినట్లు అవినీతి నిరోధకశాఖ అధికారులు గుర్తించారు. ఆమెతోపాటు ఇతర అధికారులూ ఇదే తరహాలో డొల్ల కంపెనీలు స్థాపించి మందుల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారణ అయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. ఉపేక్షించను

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆయనపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీవర్గాలు తెలిపాయి. బోధన మాధ్యమం విషయంలో ప్రభుత్వ, పార్టీ వైఖరికి భిన్నంగా నాయకులు ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు, పార్టీ నుంచి బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టంచేసినట్టు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జనాభా లెక్కలకు రూ.8,754 కోట్లు

దిల్లీ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 2021 జనాభా లెక్కల సేకరణకు రూ.8,754.23 కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖ సిఫార్సు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. 16 భాషల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు మంగళవారం ఆయన లోక్‌సభలో పేర్కొన్నారు. ఈసారి లెక్కలను మొబైల్‌ యాప్‌తోపాటు, పేపర్‌ ద్వారానూ సేకరించనున్నట్లు చెప్పారు. జనాభా గణకులు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా వివరాలు సేకరించి నేరుగా సబ్‌మిట్‌ చేయొచ్చన్నారు. లేదంటే తొలుత పేపరు పద్ధతిలో సేకరించి తర్వాత వాటిని మొబైల్‌ యాప్‌ద్వారా అప్‌లోడ్‌ చేయవచ్చని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సహకారానికి ‘చక్కెర’

సహకార చక్కెర కర్మాగారాలు రైతులకు బకాయిపడిన మొత్తాలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా నిధుల విడుదలకు ఆర్థికశాఖకు సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సహకార చక్కెర పరిశ్రమలు, డెయిరీల పునరుద్ధరణపై సమీక్షించారు. రాష్ట్రంలో చెరకు సాగు, చక్కెర పరిశ్రమలు, వాటి ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. పది పరిశ్రమలపై రూ.891.13 కోట్ల భారం ఉందని అధికారులు సీఎంకు నివేదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఉత్తమ్‌ను కొనసాగించకుంటే నాకు మద్దతివ్వండి: జగ్గారెడ్డి

ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని ఆ పదవిలో కొనసాగించాలని, ఒక వేళ మార్పు ఉంటే తనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి విలేకరులతో ముచ్చటిస్తూ.. రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం వస్తే పోటీలో ఉన్నవాళ్లంతా సమర్థులేనని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తప్పుడు కేసులపై న్యాయపోరాటం

తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు... న్యాయపోరాటం చేస్తామని తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. కార్యకర్తలను హింసిస్తే ప్రైవేట్‌ కేసులు పెట్టి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహిస్తున్న తెదేపా జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రెండోరోజు మంగళవారం ఆయన పాల్గొన్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఇంటికి వెళ్లారు. అక్కడ  నియోజకవర్గ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. వారికి దిశానిర్దేశం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏపీలో ఏ ప్రాజెక్టులోనూ పెట్టుబడులు పెట్టం

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాజెక్టులోనూ పెట్టుబడులు పెట్టకూడదని లూలూ గ్రూపు నిర్ణయించినట్లు ఆ సంస్థ భారతదేశ సంచాలకులు అనంత్‌రామ్‌ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రం తమ పెట్టుబడులను యథావిధిగా షెడ్యూలు ప్రకారం పెడతామన్నారు. ఏపీలోని విశాఖ నగరానికి కన్వెన్షన్‌, షాపింగ్‌హబ్‌గా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేలా అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రం, షాపింగ్‌మాల్‌, ఐదు నక్షత్రాల హోటల్‌ నిర్మాణాలను చేపట్టాలని లూలూ సంస్థ భావించిందని ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కార్టోశాట్‌-3 ప్రయోగానికి సన్నాహాలు

చంద్రయాన్‌-2తో ప్రపంచస్థాయిలో సత్తా చాటిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నవంబరు, డిసెంబరు నెలల్లో కీలక ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. సరిహద్దు భద్రతను పెంచే దిశగా సమర్థమైన ఛాయాచిత్ర (ఇమేజింగ్‌) వ్యవస్థలున్న కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని ఈ నెల 25న ప్రయోగించనున్నట్లు ఇస్రో మంగళవారం బెంగళూరులో ప్రకటించింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపుదాడులు చేయడంలో ఉపకరించిన రిశాట్‌ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహాలకు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దిల్లీ 9.. బెంగళూరు 20..

ప్రపంచంలో అత్యంత వేగంగా ధరలు పెరుగుతున్న ఖరీదైన నివాస విపణుల జాబితాలో దిల్లీకి 9వ ర్యాంకు లభించింది. బెంగళూరు 20వ స్థానంలోను, ముంబయి 28వ స్థానంలోనూ నిలిచాయి. 2019 మూడో త్రైమాసికానికి అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఈ జాబితాను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో ఖరీదైన నివాస సముదాయల ధరల కదలికలను స్థానిక కరెన్సీతో లెక్కగట్టి ఈ ర్యాంకులు ఇచ్చింది. ‘ముంబయి, దిల్లీ ర్యాంకులను పెంచుకున్నప్పటికీ గత మూడు నెలల్లో ఈ నగరాల్లో విలాస వంత గృహాల ధరలు స్థిరంగానే ఉన్నాయ’ని నైట్‌ ఫ్రాంక్‌ ఎండీ, ఛైర్మన్‌ శిశిర్‌ బైజాల్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టికెట్లన్నీ హాంఫట్‌

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే డేనైట్‌ టెస్టుపై ప్రేక్షకుల్లో ఆసక్తి మామూలుగా లేదు. ఈ మ్యాచ్‌ తొలి నాలుగు రోజుల టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మంగళవారం చెప్పాడు. ‘‘టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించి అధికారిక మస్కట్లు ‘పింకు-టింకు’లను అతడు ఆవిష్కరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.