
తాజా వార్తలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఓ వధువు పెళ్లిలో వినూత్న వేషధారణతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీరును బయటపెట్టింది. వివాహం సందర్భంగా మెడలో బంగారు ఆభరణాల బదులు టమాటాలతో తయారు చేసిన దండ వేసుకుని అందరి దృష్టినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను నైలా ఇనాయత్ అనే పాక్ పాత్రికేయురాలు ట్విటర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌లో గత కొద్ది రోజులుగా టమాటా ధర కిలో రూ.320కు చేరింది. దీంతో దేశంలో బంగారం మాదిరిగా టమాటా విలువ కూడా పెరిగిపోతుండడంతో తాను ఇలా వినూత్నంగా వేషధారణ చేసుకున్నానని వెల్లడించింది. మెడలో దండతో పాటు, చెవులకు కూడా టమాటాలతో చేసిన చెవిపోగులనే ధరించిన ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు సైతం ఈ వీడియోపై చమత్కారంగా కామెంట్లు చేశారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రజనీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి
- రాహుల్‌కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
- పౌరసత్వ చట్టంతో కాంగ్రెస్‌కు కడుపునొప్పి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
