close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. ‘పవన్‌ దిల్లీ పర్యటనతో మాకు సంబంధంలేదు’

ప్రజాసమస్యలపై మున్ముందు చేసే పోరాటాలను రాష్ట్రంలోని అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలను కలుపుకొని చేస్తామని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇవాళ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ దిల్లీ వెళ్లిన పరిణామాలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ఆయన స్పష్టంచేశారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక సమస్యపై తమ అధినేత చంద్రబాబు చేసిన దీక్షకు అనూహ్య స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు దీక్షలో పాల్గొనటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత బయటపడిందని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ముగిసిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెరాస ఎంపీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈనెల 18న నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన పెండింగ్‌ అంశాలతో పాటు రావాల్సిన నిధులు గురించి సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అందుకే వంశీ వైకాపాలోకి: లోకేశ్‌

ఆస్తులు కాపాడుకునేందుకే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైకాపాలోకి వెళ్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. నిన్న సాయంత్రం  మీడియా సమావేశం ఏర్పాటు చేసి త్వరలో వైకాపాలో చేరనున్నట్లు ప్రకటించిన వంశీ .. తెదేపా నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.  ఈనేపథ్యంలో వంశీ ఆరోపణలపై లోకేశ్‌ స్పందించారు. ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టం లేదని పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి, వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఒకే దేశం.. ఒకే రోజు వేతనం’! 

‘ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు’ నినాదానికి కొనసాగింపుగా మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన కేంద్ర సర్కార్‌.. త్వరలో దేశవ్యాప్తంగా వేతనాల విషయంలోనూ అలాంటి చట్టమొకటి తీసుకొచ్చేందుకు  ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శ్రామికవర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘వన్‌ నేషన్‌.. వన్‌ పే డే’ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఐరాసకు భారీగా నిధులు ఇవ్వనున్న భారత్‌!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి 2020లో భారత్‌ తన తరఫున భారీ నిధుల్ని అందించనుంది. మొత్తం 13.5 మిలియన్‌ డాలర్లు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత మిషన్‌ కౌన్సిలర్‌ అంజనీ కుమార్‌ సాధారణ సభలో ప్రకటించారు. ఐరాస ఏర్పడిన నాటి నుంచి భారత్‌ భారీగా నిధుల్ని సమకూర్చుతోందని.. వచ్చే ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘మీటూ’ఆరోపణలపై పెదవి విప్పిన అనూమాలిక్‌

తనపై వస్తున్న ‘మీటూ’ ఆరోపణలపై ప్రముఖ సంగీత దర్శకుడు‌, ఇండియన్‌ ఐడిల్‌ న్యాయ నిర్ణేత అనూ మాలిక్‌ ఎట్టకేలకు పెదవి విప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తమైనవని ఆయన పేర్కొన్నారు. తమను లైంగికంగా వేధింపులకు గురిచేసిన వారి గురించి సినీతారలు ‘మీటూ’ ఉద్యమంలో గళమెత్తి చెప్పిన విషయం తెలిసిందే. ఈ ‘మీటూ’ ఉద్యమం వల్ల ఎందరో సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది అనూ మాలిక్‌ తమను లైంగికంగా వేధించారని సింగర్స్‌ సోనా మొహాపత్రా, శ్వేతా పండిత్‌ సోషల్‌మీడియా వేదికగా ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సచిన్‌ దిగ్గజమని అప్పుడే తెలుసు: సన్నీ

సచిన్ తెందూల్కర్‌ క్రికెట్‌ దిగ్గజంగా ఎదుగుతాడని తానెప్పుడో ఊహించానని టీమిండియా మాజీ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ అన్నారు. అతడి బ్యాక్‌ఫుట్‌ షాట్లను చూసే గొప్పవాడవుతాడని అనుకున్నానని వెల్లడించారు. రికార్డుల పుస్తకాలను సవరించిన లిటిల్‌ మాస్టర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి శుక్రవారానికి 30 ఏళ్లు. భారత్‌, బంగ్లా మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సన్నీ ఈ సందర్భం గురించి మాట్లాడారు. 15 ఏళ్ల వయసులో నెట్స్‌లో సచిన్‌ సాధన గురించి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మంత్రి ఈటల రాజేందర్‌ కుమార్తె నీత-అనూప్‌ల వివాహం

9. ‘పెళ్లిళ్లు అవుతుంటే..ఇంకెక్కడ మందగమనం?’

దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్న వేళ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమానాశ్రయాలు, రైళ్లు నిండుతున్నాయ్‌.. ప్రజలకు పెళ్లిళ్లవుతున్నాయ్‌.. ఆర్థిక వ్యవస్థ బాగా ఉందనడానికి ఇవి నిదర్శనాలు అంటూ వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రారంభించబోయే సరకు రవాణా కారిడార్‌ను పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఆయన ఈవిధంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయికు ఘన సన్మానం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.