close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. కారు ఉన్నా సరే వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ

ఏపీలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల బియ్యం కార్డులు కలిగిన వారితోపాటు వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కార్డు, జగనన్న విద్య అర్హత ఉన్న కుటుంబాలూ ఈ పథకానికి అర్హులుగా తెలిపింది. కుటుంబంలో ఒక కారు ఉన్నవారికీ ఈ పథకం వర్తించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

2. 5 నెలల సమయం ఎందుకు తీసుకుంది?

ఇసుక వారోత్సవాలను నిర్వహించేందుకు వైకాపా ప్రభుత్వం 5 నెలల సమయం ఎందుకు తీసుకుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు’ పేరిట ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరాన్ని పవన్‌ కల్యాణ్‌  ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. మయాంక్‌ శతకం.. ఆధిక్యం దిశగా భారత్‌

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌(101) శతకంతో ఆకట్టుకున్నాడు. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(424) అతడికి చక్కటి సహకారం అందిస్తుండగా టీమిండియా భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. కెప్టెన్‌ కోహ్లీ(0) ఔటయ్యాక మయాంక్‌, రహానె 87 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

4. గొగొయి చివరి పనిదినం ప్రత్యేకంగా..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి తన చివరి పని దినాన్ని ప్రత్యేకంగా ముగించారు. తన ధర్మాసనంలో విచారణకు లిస్టయిన పిటిషన్లన్నింటికీ ఒకేసారి నోటీసులు జారీ చేశారు. ఈ విధంగా సీజేఐగా తన చివరి పని దినాన్ని ముగించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జస్టిస్‌ రంజన్‌ గొగొయికు వీడ్కోలు పలకనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. 5 కాదు.. 25ఏళ్లు శివసైనికుడే సీఎం: రౌత్‌

మహారాష్ట్రలో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ ‘‘మేం అధికారంలోకి రాబోతున్నాం. ఫార్ములా గురించి ఆలోచించొద్దు. ఐదేళ్లు కాదు.. 25ఏళ్ల వరకు శివసైనికుడే సీఎంగా ఉండాలని కోరకుంటున్నాం. ఉద్దవ్‌ ఠాక్రే సమర్థుడు. శివసేన నుంచే ముఖ్యమంత్రి ఉంటారు. శివసేన నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మహారాష్ట్రపై గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలనుద్దేశించి.. ‘‘క్రికెట్‌లో, రాజకీయాల్లో ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చని’’ వ్యాఖ్యానించారు.  తాను ఈ మధ్య దిల్లీ రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండడం వల్ల మహారాష్ట్రలో విషయాలపై పెద్దగా సమాచారం లేదన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. అభివృద్ధి పనులు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పాక్‌ డీఎన్‌ఏలోనే ఉగ్రవాదం: భారత్‌

కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై రాజకీయం చేయాలని చూస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ అవకాశం దొరికిన ప్రతిచోట దీటైన సమాధానం ఇస్తూ వస్తోంది. తాజాగా ప్యారిస్‌లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంతస్కృతిక సంస్థ(యునెస్కో) సదస్సులో పాక్‌ లేవనెత్తిన కశ్మీర్‌ అంశాన్ని భారత్‌ తిప్పికొట్టింది. ఉగ్రవాదం పాక్‌ డీఎన్‌ఏలోనే ఉందంటూ భారత ప్రతినిధి అనన్య అగర్వాల్‌ పాక్‌ ప్రతినిధులను కడిగిపారేశారు. పాక్‌ అనుసరిస్తున్న విపరీత పోకడలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థని కుంగదీశాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఘనంగా అర్చన వివాహం

9.  ఈనెల 20 నుంచి 23 వరకూ ‘ఇండియా జాయ్’

10. లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.73 గా ఉంది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.