close

తాజా వార్తలు

ఉత్తరం రాయండి.... బహుమతి పట్టండి

మహాత్మాగాంధీని ఉద్దేశించి ఉత్తరాల పోటీ

ఈనెలాఖరుతో ముగుస్తున్న గడువు

పోటీకి సంబంధించి తపాలాశాఖ విడుదలచేసిన సమాచార పత్రం

 కొత్తవలస, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాల సందర్భంగా తపాలా శాఖ ‘డాయి అఖర్‌’ పేరుతో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పోటీలకు లేఖలు పంపడానికి ఇంకా 20 రోజులు మాత్రమే గడువుంది. ఈ పోటీ ఈ ఏడాది ఆగస్టు 1న ప్రారంభమైంది. లేఖలు పంపడానికి గడువు ఈనెలాఖరుతో ముగుస్తోంది. ఆ తర్వాత పంపే ఉత్తరాలను స్వీకరించరు. ప్రజల్లో ముఖ్యంగా చిన్నారుల్లో ఉత్తరాలు రాసే అభిరుచిని పెంపొందించేందుకు తపాలా శాఖ ఈ పోటీ నిర్వహిస్తోంది. ఏ వయసువారైనా ఈ అర్హులే. పోటీలో పాల్గొనేవారు ‘ప్రియమైన బాపూ... మీరు అమరులు’ శీర్షికతో మహాత్మాగాంధీని ఉద్దేశించి ఉత్తరాలు రాయాల్సి ఉంటుంది. ఆంగ్లం, హిందీ, ఇతర అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ ఉత్తరాలు రాసేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో విజేతలను ఎంపిక చేసి నగదు బహుమతిని ఇస్తారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారి పేర్లను జాతీయ స్థాయి పరిశీలనకు పంపుతారు. రాసిన ఉత్తరాలను సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌, విజయవాడ అనే చిరునామాలకు పంపాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కొత్తవలస సబ్‌ పోస్టుమాస్టర్‌ దన్నాన చంద్రశేఖర్‌ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.

అన్ని వయసులవారూ అర్హులే: ఈ పోటీల్లో పాల్గొనేందుకు అన్ని వయసుల వారూ అర్హులే. పోటీలో పాల్గొనేవార్ని 18 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాలు ఆపై వయసు వారీగా విభజిస్తారు. వయసు ధ్రువీకరణ పత్రం ఉత్తరంతో పాటు విధిగా పంపాలి. 2019 జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాలు లోపు/దాటి ఉన్నట్లు ధ్రువీకరించాలి. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన అభ్యర్థుల వయో నిర్ధరణ గుర్తింపు పత్రాలను జాతీయస్థాయికి పంపే ముందు పరిశీలిస్తారు. పోటీదారులు ‘డాయి అఖర్‌ జాతీయ ఉత్తరాల రాత పోటీ’ శీర్షికతో ఇన్‌లాండ్‌ లెటర్‌పై 50 మాటలు మించకుండా, ఎ4 సైజు కాగితంపై రాసి పోస్టు చేస్తే వెయ్యి మాటలకు మించకుండా సొంత దస్తూరితో రాయాలి. సొంత దస్తూరితో రాసిన ఉత్తరాలను మాత్రమే అంగీకరిస్తారు. ఎన్వలప్‌, ఇన్‌లాండ్‌ లెటర్‌ కార్డులను మాత్రమే అనుమతిస్తారు. ఈ కేటగిరీల ప్రాతిపదికనే విజేతలను ఎంపికచేస్తారు.

నగదు పురస్కారం: రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.25వేలు, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి రూ.10వేలు, రూ.5వేలు నగదు బహుమతి ఇస్తారు. జాతీయస్థాయిలో ప్రథమస్థానానికి రూ.50వేలు, ద్వితీయానికి రూ.25వేలు, తృతీయస్థానానికి 10వేలు చెల్లిస్తారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.