close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. మహా ట్విస్ట్‌: ఎన్సీపీకి గవర్నర్‌ పిలుపు

మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనకు ఇచ్చిన గడువు ముగిసిన కాసేపటికే మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)ని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ పార్టీకి సమాచారమిచ్చారు. 24 గంటల గడువును నిర్దేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. భావోద్వేగాలు, సానుభూతితో తేల్చలేం: హైకోర్టు

ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులను రేపటివరకు న్యాయస్థానం పొడిగించింది. కార్మిక శాఖ వద్ద మధ్యవర్తిత్వం ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే సమ్మెకు వెళ్లారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కృష్ణయ్య కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నందున జోక్యం చేసుకోవాలని కృష్ణయ్య కోరగా.. కోర్టులు ఏ కేసునైనా చట్టం ప్రకారమే తేలుస్తాయని, భావోద్వేగాలు.. సానుభూతితో తేల్చలేవని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అయోధ్య తీర్పు రివ్యూపై 17న నిర్ణయం

అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష(రివ్యూ) పిటిషన్‌ వేయాలా వద్దా అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ముస్లిం పక్షాల తరఫు న్యాయవాది జఫర్‌యాబ్‌ జిలానీ తెలిపారు. ఈ మేరకు నవంబరు 17న జరిగే ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సమావేశంలో రివ్యూ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఇసుక దీక్షకు భాజపా మద్దతుకోరిన తెదేపా

రాష్ట్రంలో ఇసుక కొరత, ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈనెల 14న తమ పార్టీ అధినేత చంద్రబాబు తలపెట్టిన దీక్షకు మద్దతివ్వాలని భాజపాను తెదేపా కోరింది. ఈ మేరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా భేటీ అయ్యారు. నిరసన దీక్షకు మద్దతివ్వాలని కోరారు. ప్రజాసమస్యలపై సొంతంగా పోరాడాలని తాము నిర్ణయించుకున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ఆలపాటికి తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సీఎం కేసీఆర్‌తో కేంద్ర జలశక్తిమంత్రి భేటీ

సీఎం కేసీఆర్‌తో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ భేటీ అయ్యారు. మిషన్‌ భగీరథ పథకం పనులు జరుగుతున్న తీరును కేసీఆర్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిషన్‌ భగీరథపై పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్రమంత్రికి సీఎం, అధికారులు వివరించారు. దీంతోపాటు మిషన్‌ కాకతీయ పథకం కింద 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేసినట్లు సీఎం ఆయనకు తెలిపారు. రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకం దాదాపుగా పూర్తయిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. రేపటి నిరాహార దీక్ష వాయిదా: జేఏసీ

ఆర్టీసీ సమ్మెపై రేపు హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో తాము తలపెట్టిన నిరాహార దీక్షను వాయిదా వేసినట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మెపై విచారణ రేపటికి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమన్న వాదనను కోర్టు తిరస్కరించిందన్నారు. మంగళవారం మరోసారి విచారణ ఉన్న నేపథ్యంలో తాము తలపెట్టిన నిరాహార దీక్షను వాయిదా వేసినట్లు చెప్పారు. విచారణ అనంతరం తర్వాతి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. BSNL: 70వేల మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రకటించిన తర్వాత ఇప్పటివరకూ దాదాపు 70వేల మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఆ సంస్థ ఛైర్మన్‌, ఎండీ పి.కె.పూర్వార్‌ తెలిపారు. మొత్తం 1.50లక్షల ఉద్యోగుల్లో లక్షమంది వరకూ వీఆర్‌ఎస్‌కు అర్హులు కాగా, వీరిలో 77వేల మందిని వీఆర్‌ఎస్‌ కింద పంపాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ప్రకటించిన ఈ పథకం జనవరి 31, 2020 వరకూ అందుబాటులో ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. నటుడు టి.విజయ్ చందర్‌కు కీలక పదవి

సీనియర్‌ నటుడు టి.విజయ్ చందర్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని ప్రకటించింది. ఆయనను రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంటూ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ  పేర్కొంది. అటు రాష్ట్ర అధికార భాషా సంఘానికి కూడా సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అయోధ్య: ట్రస్ట్‌ ఏర్పాటుకు మొదలైన ప్రక్రియ

అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఆ ప్రక్రియ మొదలుపెట్టింది. ట్రస్ట్‌ ఏర్పాటు కంటే ముందు తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఒకటి ఏర్పాటైంది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో తీర్పును పూర్తిగా అర్థం చేసుకోవడంలో ఆ బృందం నిమగ్నమై ఉందని ఓ అధికారి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఆస్పత్రికి లోకో పైలట్‌ తరలింపు

కాచిగూడ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో బోగీలో చిక్కుకున్న లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బయటకు తీశారు. కేబిన్‌ నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న లోకో పైలట్‌ తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 8 గంటలపాటు నరకయాతన అనుభవించిన ఆయన్ను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. గ్యాస్‌ కట్టర్‌ సాయంతో కేబిన్‌ను కత్తిరించి చంద్రశేఖర్‌ను బయటకు తీశారు. వెంటనే అతడ్ని నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.