
తాజా వార్తలు
1. విదేశాలకూ పాకిన ఆర్టీసీ సమ్మె సెగ
తెలంగాణ ఆర్టీసీ ఐకాస కార్మికులు చేపడుతున్న సమ్మె సెగ విదేశాలకూ పాకింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని వాషింగ్టన్లో ఆదివారం జరిగిన తెలంగాణ అభివృద్ధి వేదిక (టీడీఎఫ్) 20వ వార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం మధ్యలో కొందరు ఎన్నైరైలు పైకి లేచి ప్లకార్డులు ప్రదర్శించారు. ‘సేవ్ ఆర్టీసీ..సేవ్ ఆర్టీసీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ముట్టడిస్తే చర్యలు తప్పవు: అంజనీకుమార్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృత రూపం దాల్చుతోంది. కార్యాచరణలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లముట్టడికి ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేవిధంగా ముట్టడిలకు పిలుపునిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో అలజడి సృష్టించవద్దని కోరారు. ఆర్టీసీ జేఏసి ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రుల నివాసం వద్ద భారీ భద్రదతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. భాజపాది అహంకారం: సంజయ్ రౌత్
మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. భాజపాతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన శివసేన.. తాజా పరిణామాలతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. అయితే భాజపా అహంకార ధోరణి వల్లే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితులు చోటుచేసుకున్నాయని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. భాజపా తన మాట మీద నిలబడనప్పుడు ఇక రెండు పార్టీల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండబోవని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఓవైపు ఉత్కంఠ..మరోవైపు ఎమ్మెల్యేల టూర్
ఓవైపు మహారాష్ట్రలో పార్టీల వరుస సమావేశాలతో రాజకీయం వేడెక్కితే మరోవైపు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం రాజస్థాన్‌లో చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శిస్తూ గడుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో పార్టీ తమ 40మంది ఎమ్మెల్యేల్ని శుక్రవారం రాజస్థాన్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు జోధ్‌పూర్‌లోని పలు పర్యాటక ప్రదేశాలు, పుష్కర్ ఉత్సవం, ప్రముఖ అజ్మేర్ దర్గాను సందర్శించారు. అలా ఆదివారానికి జైపూర్ చేరుకున్నారు. ఈరోజు అక్కడి ప్రముఖ ప్రదేశాలను వీక్షించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. శేషన్.. నిష్పక్షపాతమైన వ్యక్తి: రాహుల్
కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ మరణం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా, ధైర్యంగా ఉండే అతికొద్ది మంది ఎన్నికల అధికారుల్లో శేషన్ ఒకరని రాహుల్ కొనియాడారు. ‘ఇప్పటిలా కాకుండా ఒకప్పుడు మన ఎన్నికల కమిషనర్లు నిష్పక్షపాతంగా, గౌరవప్రదంగా, ధైర్యంగా ఉండేవారు. అలాంటి వారిలో టీఎన్ శేషన్ ఒకరు. ఆయన మృతి బాధాకరం. శేషన్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. సేనకు సీఎం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు డిప్యూటీ!
మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తెలిపేందుకు శివసేనకు సమయం దగ్గరపడుతోంది. సర్కారు కొలువుతీరాలంటే సేనకు కాంగ్రెస్-ఎన్సీపీ మద్దతు తప్పనిసరి కావడంతో ఆ పార్టీల నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు ఎన్సీపీ మాత్రం కాంగ్రెస్‌తో చర్చల తర్వాతే తమ వైఖరి తెలియజేస్తామని చెబుతోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన బేరసారాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ రెండు పార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మా ఓటమికి అదే కారణం: మహ్మదుల్లా
టీమిండియాతో జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు ఆ జట్టు కెప్టెన్ మహ్మదుల్లా. వెనువెంటనే వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి కారణమన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మహ్మదుల్లా నయీమ్‌ని కొనియాడాడు. ‘30 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో గెలిచే అవకాశం మావైపే ఉంది. ఆఖర్లో వెనువెంటనే వికెట్లు కోల్పోవడం మా ఓటమికి కారణం’’ అని వ్యాఖ్యానించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరా సెక్టార్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. శ్రీనగర్‌కు 55 కిలోమీటర్ల దూరంలోని లాదారా గ్రామంలో ఉగ్రవాదులు మాటువేసి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమవ్వగా.. భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అబ్దుల్లాపూర్‌మెట్‌లో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ వసతి గృహంలో బీఫార్మసీ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్ ప్రాంతానికి చెందిన బసవరాజ్ (19) అనే విద్యార్థి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుంతపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని వసతి గృహంలో ఉంటున్నాడు. వసతి గృహంలోని పై అంతస్తులోని బాత్రూమ్లో ఉరివేసుకుని సోమవారం ఉదయం మృతి చెందాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
