close

తాజా వార్తలు

సకల జనుల దీక్ష విజయవంతం: అశ్వత్థామ

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించిన ‘సకల జనుల సామూహిక దీక్ష’ విజయవంతమైందని ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ మహిళా కార్మికులతో పాటు పలు మహిళా సంఘాలు ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో కీలకపాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి మద్దతిచ్చిన మహిళలు, ప్రజాసంఘాలకు ఐకాస తరఫున అశ్వత్థామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 
ట్యాంక్‌బండ్‌పై మహిళలపై జరిగిన దాడికి నిరసనగా ఆదివారం ఉదయం అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఐకాస సమావేశం నిర్వహిస్తామని.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తామని అశ్వత్థామ తెలిపారు. మహిళలపై దాడిని ఏ ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడం దారుణమని ఆయన ఆక్షేపించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.