close

తాజా వార్తలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

 సూచించిన మార్గాల్లోనే వెళ్లాలి: అదనపు ట్రాఫిక్‌ కమిషనర్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్‌ అదనపు ట్రాఫిక్‌ కమిషనర్‌ నగరంలో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ట్యాంక్‌ బండ్‌పైకి వచ్చే వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడంతో పాటు ఆయా మార్గాల్లో వాహనాలను దారి మళ్లించారు.  సూచించిన మార్గాల్లో మాత్రమే వాహనదారులు వెళ్లాలని ట్రాఫిక్‌ అధికారులు పేర్కొన్నారు.
* ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాకపోకలను నిలిపివేశారు. 
* సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ వైపు మళ్లింపు 
* ఆర్టీసీ క్రాస్ రోడ్‌ నుంచి ఇందిరా పార్క్‌ వైపు వచ్చే వాహనాలు అశోక్ నగర్ నుంచి మళ్లింపు.
* తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాహనాలు సమాంతరంగా మరో మార్గంలో వెళ్లాలని సూచన.
* హిమాయత్ నగర్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు బషీర్ బాగ్ వైపు మళ్లింపు.
* ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ రూట్ నుంచి వచ్చే వాహనదారులు పీసీఆర్ జంక్షన్ దగ్గర దారి మళ్లింపు.
* ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనదారులు ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నెక్ లెస్‌ రోడ్ అండ్ మింట్ కాంపౌండ్‌ వైపు మళ్లింపు. 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.