close

తాజా వార్తలు

ఒక్కో కార్మికుడికి రూ.64,700 బోనస్‌!

సింగరేణి యాజమాన్యం ప్రకటన!

గోదావరిఖని‌: బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం తీపి కబురు చెప్పింది. ఈ దీపావళికి బోనస్‌ను చెల్లించనున్నట్టు ప్రకటించింది. సింగరేణిలో దీపావళికి ముందు కార్మికులకు బోనస్‌ చెల్లిస్తుంటారు. గతేడాది కార్మికులకు రూ.60,500 చొప్పున చెల్లించగా.. ఈసారి 64,700 చొప్పున బోనస్‌గా ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రతిభ ఆధారిత ప్రయోజనం (పీఎల్‌ఆర్‌- బోనస్‌)కింద ఈ బోనస్‌ మొత్తాన్ని ఈ నెల 25న కార్మికులకు చెల్లించనున్నట్టు యాజమాన్యం స్పష్టంచేసింది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 48వేల మందికి పైగా కార్మికులు బోనస్‌ అందుకోనున్నారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.