close

తాజా వార్తలు

తితిదే బోర్డు ధర్మకర్తల మండలి భేటీ

తిరుమల : తితిదే ధర్మకర్తల మండలి భేటీ అయింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, వసతులు,  దర్శన సంబంధిత సేవలపై కీలకంగా చర్చించనున్నారు. తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈ సమావేశం కొనసాగుతోంది. తిరుపతిలో గరుడ వారధి, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల పెంపు, పీఆర్వో విభాగంలో పదోన్నతులు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పెట్టుబడులు తదితర అంశాలపై నిర్ణయాలుతీసుకోనున్నారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. అనంతరం తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి బోర్డు నిర్ణయాలను మీడియాకు వెల్లడించనున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.