close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. పోలీసులు ప్రజల మన్ననలు పొందాలి: జగన్‌

సాధారణ ప్రజల గౌరవం, మన్ననలు పొందేలా పని చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పిలుపునిచ్చారు. పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ఆయన కొనియాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పోలీసుల త్యాగాలకు రుణపడి ఉన్నాం

పోలీసుల ప్రాణ త్యాగాలకు మనమెంతో రుణపడి ఉన్నామని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మన భవిష్యత్తు కోసం వారి ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్‌ ప్రజల భద్రతకు పెద్దపీట వేసిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కాంగ్రెస్‌ ముఖ్యనేతల గృహనిర్బంధం

తెలంగాణ ఆర్టీసీ ఐకాస సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ముఖ్యనాయకులను వారి ఇళ్ల వద్దే గృహ నిర్భందం చేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను తొలుత వేర్వేరు ప్రాంతాలకు తరలించిన పోలీసులు.. ఆ తర్వాత భట్టిని ఇంటికి తీసుకొచ్చి గృహనిర్భందం చేశారు. ఎంపీ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. బేగంపేట మెట్రో స్టేషన్‌ మూసివేత

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రగతి భవన్‌ ముట్టడినిస్తానని ప్రకటించిన నేపథ్యంలో బేగంపేట మెట్రోస్టేషన్‌ను మూసివేశారు. ప్రగతి భవన్‌కు సమీపంలోని బేగంపేట మెట్రోస్టేషన్‌ నుంచి ఆందోళన కారులు, కాంగ్రెస్‌ నాయకులు ప్రగతి భవన్‌కు చేరుకోవచ్చనే అనుమానంతో పోలీసుల ఆదేశాల మేరకు మెట్రోస్టేషన్‌లో రాకపోకలను నిలిపివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఎస్‌ఆర్‌ఎస్పీ 8 గేట్ల ఎత్తివేత

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి నిల్వ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు ఎనిమిది వరద గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు, కడప జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో కారు-లారీ ఢీ  కొన్న ఘటనలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఓటర్లు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడి సంగ్లి, నాసిక్‌, పుణె, రత్నగిరి, ఔరంగాబాద్‌ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొల్హాపూర్‌, సతారా ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. సౌదీ ప్రమాద బస్సులో 9మంది భారతీయులు

సౌదీ అరేబియాలో గత బుధవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం తొమ్మిది మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. వీరిలో ఇద్దరు గాయపడ్డట్లు.. వారు ప్రస్తుతం జెద్దాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మరో ఏడుగురి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. 8 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

సొంతగడ్డపై టీమిండియా బౌలర్లు జోరు కొనసాగిస్తున్నారు. లంచ్‌ విరామం అనంతరం ఆట మొదలు పెట్టిన సఫారీ జట్టుకు వెంటనే షాక్‌ తగిలింది. 36వ ఓవర్లో షమీ వేసిన నాలుగో బంతిని ఆడిన పీట్‌(4) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లో రబాడను ఉమేశ్‌ యాదవ్‌ రనౌట్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. దశాబ్దాలుగా కృష్ణా నదే వారికి ఆవాసం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.