close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ‘వైష్ణవ జనతో’ అద్భుతం: తమిళిసై

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఆధ్వర్యంలో రూపొందించిన ‘వైష్ణవ జనతో’ వీడియో అద్భుతంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కితాబిచ్చారు. ఏఎస్‌ఐఎస్‌సీ ఏపీ, తెలంగాణ రీజియన్‌, రమాదేవి పబ్లిక్‌స్కూల్‌ ఆధ్వర్యంలో రామోజీఫిల్మ్‌సిటీలో నిర్వహించిన ఏఎస్‌ఐఎస్‌సీ 23వ జాతీయస్థాయి సాహితీ అంశాల పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆర్టీసీ సమ్మెను ఉద్ధృతం చేస్తాం: లక్ష్మణ్‌

తెలంగాణ ఆర్టీసీ సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. నాంపల్లిలోని పార్టీకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మెడలు వంచాలంటే ఆర్టీసీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్యమంలో మేధావులతో సహా అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా లక్ష్మణ్‌ సమక్షంలో పలువురు వైద్యులు భాజపాలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని లక్ష్మణ్‌ సాదరంగా భాజపాలోకి ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గరిష్ఠస్థాయి నీటిమట్టానికి శ్రీరాంసాగర్‌

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 38,216 క్యూసెక్కులు కాగా..ఔట్‌ఫ్లో 658 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటిమట్టం 1,090 అడుగులు కాగా.. ప్రస్తుతం అంతే నీటిమట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 90.313 టీఎంసీలకుగానూ.. ప్రస్తుతం 84.841 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో అధికారులు ప్రధాన కాల్వలకు నీటిని విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పాక్‌ కాల్పుల్లో అమరులైన ఇద్దరు జవాన్లు

జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు ఆదివారం మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కుప్వారా జిల్లాలోని తాంఘర్ సెక్టార్‌లో భారత బలగాలపైకి కాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు జవాన్లు అమరులు కాగా.. ఓ సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల నెపంతో చొరబాటుదారులను భారత భూభాగంలోకి పంపేందుకు పాక్ బలగాలు ప్రయత్నిస్తున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడులను మన భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోదీజీ..మమ్మల్నీగుర్తించండి: ఉపాసన

‘మోదీజీ.. దక్షిణాది తారలను కూడా గుర్తించండి’ అని అంటున్నారు ఉపాసన కొణిదెల. భారత వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో ప్రధాని మోదీ శనివారం తన నివాసంలో సమావేశమైన విషయం తెలిసిందే. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని సినీ, టీవీ రంగాలు రూపొందించిన నాలుగు సాంస్కృతిక వీడియోలను మోదీ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటీనటులు షారుక్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, సోనమ్‌ కపూర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌‌, కంగనారనౌత్‌, ఏక్తాకపూర్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తాడేపల్లిలో పేలుళ్ల కలకలం

గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రకాశ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేలుళ్లు కలకలం సృష్టించాయి. పేలుడు ధాటికి ఇనుప గేట్లు, తలుపులు విరిగిపడ్డాయి. మంటలు అంటుకొని పైడమ్మ అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అయితే ఫ్రిడ్జ్‌ నుంచి వెలువడిన గ్యాస్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విజయవాడలో 3కె వాక్‌

8. పంచెకట్టులో రాజమౌళి

ఎన్నో హిట్‌ చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడూ చాలా సింపుల్‌గా కనిపిస్తుంటారు. తాజాగా ఆయన విదేశాల్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి సంప్రదాయ వస్త్రధారణలో హాజరై అందర్నీ ఆకట్టుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ప్రదర్శన శనివారం జరిగింది. చిత్ర ప్రదర్శన జరుగుతున్నంతసేపు చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి నేతృత్వంలో నేపథ్య సంగీత ప్రదర్శన నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సిక్స్‌తో ద్విశతకం బాదిన రోహిత్‌శర్మ

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(212; 255 బంతుల్లో 28x4, 6x6) టెస్టుల్లో తొలిసారి డబుల్‌ సెంచరీ సాధించాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో హిట్‌మ్యాన్‌ శనివారం సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం లంచ్‌ విరామానికి ముందు 199 పరుగులకు చేరుకున్నాడు. భోజన విరామం తర్వాత సిక్స్‌ కొట్టి ద్విశతకం పూర్తిచేశాడు.

10. రాయ్‌లక్ష్మి ఇమేజ్‌ పెరుగుతుంది

హర్రర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సిండ్రెల్లా’. రాయ్‌లక్ష్మి ప్రధాన పాత్ర పోషించారు. వినో వెంకటేశ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఎస్‌జే సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘రొటీన్‌ ఫార్ములాలో తెరకెక్కే దెయ్యం సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఈ సినిమాతో రాయ్‌లక్ష్మి ఇమేజ్‌ పెరుగుతుంది. ఆమె కెరీర్‌లోనే ఇదో ముఖ్యమైన చిత్రం. నటన పరంగా మంచి మార్కులు పడతాయి. సాక్షి అగర్వాల్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.