close

తాజా వార్తలు

‘లిక్కర్‌’ దరఖాస్తులకు నేడే తుది గడువు

హైదరాబాద్‌ : తెలంగాణలో మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు అధిక సంఖ్యలో పోటీ పడుతున్నారు.  ఈ రోజు  సాయంత్రంతో దరఖాస్తులు చేసుకోవడానికి గడువు ముగియనుండటంతో ఇప్పటి వరకు వచ్చిన సంఖ్య కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని 2216 మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించిన ఎక్సైజ్‌ శాఖ ఈనెల 9 నుంచి స్వీకరిస్తోంది. సోమవారం వరకు 10,842 దరఖాస్తులు రాగా.. మంగళవారం 9,788 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. తద్వారా మొత్తం రాష్ట్రప్రభుత్వానికి రూ.412.60 కోట్ల రాబడి వచ్చినట్లు ఆయన వివరించారు. ఈ రోజు  అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్న అబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

రాష్ట్రంలోని 34 ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలోని 2216  మద్యం దుకాణాలకు మంగళవారం సాయంత్రం వరకు 20630 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా వరంగల్‌ డివిజన్‌లో 4050, ఖమ్మం డివిజన్‌లో 3,469, నల్గొండ డివిజన్‌లో 3.809, రంగారెడ్డి  డివిజన్‌లో 3.169 దరఖాస్తులు  వచ్చినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడించాయి. తక్కువ దరఖాస్తులు వచ్చిన డివిజన్లలో హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌లు ఉన్నట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. 

2017లో 41 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో.. దరఖాస్తు రుసుం కింద రూ.లక్ష చొప్పున  మొత్తం రూ.411 కోట్ల రాబడి వచ్చింది. అయితే ఈ సారి రుసుం రూ.2 లక్షలకు పెంచడంతో ఇప్పటి వరకు వచ్చిన 20,630 దరఖాస్తులకు రూ.412.60 కోట్ల రాబడి వచ్చింది. ఇది 2017లో వచ్చిన  రాబడిని అధిగమించింది. ఇవాళ చివరి రోజు కావడంతో 20 వేల నుంచి 25 వేల వరకు దరఖాస్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.