close

తాజా వార్తలు

స్నేహితుడి కుమార్తెను చెరబట్టారు

మద్యం మత్తులో ఇద్దరి ఘాతుకం
ఒకరిని నరికి చంపిన బాలిక తండ్రి

చెన్నై, న్యూస్‌టుడే: స్నేహితుడి ఐదేళ్ల కుమార్తెపై ఇద్దరు యువకులు మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారు. కోపోద్రిక్తుడైన బాలిక తండ్రి వారిలో ఒకరిని కత్తితో నరికి చంపాడు. మరో నిందితుడు పారిపోయాడు. తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గోపాలపురానికి చెందిన తన మిత్రులు కార్తి(24), మురుగన్‌తో కలిసి సోమవారం రాత్రి మద్యం తాగాడు. ఆ మత్తులోనే వారిద్దరినీ తన ఇంటికి తీసుకెళ్లాడు. అతడి ఐదేళ్ల కుమార్తెకు మిఠాయి కొనిస్తామని చెప్పి కార్తి, మురుగన్‌లు బయటకు తీసుకెళ్లారు. 2 గంటలు గడిచినా వారు ఇంటికి చేరుకోలేదు.బాలిక తండ్రి వారికోసం పలుచోట్ల వెతికాడు. బాలిక గాయపడి రక్తమోడుతుండగా విలపిస్తూ ఓ చోట కనిపించింది. దగ్గరకు వెళ్లిన తండ్రి ఆమెపై అత్యాచారం జరిగిందని తెలుసుకొని కోపంతో ఊగిపోయాడు.కత్తి తీసుకొని కార్తి తల, నడుము భాగంలో నరికాడు.కార్తి (24) అక్కడికక్కడే చనిపోయాడు. ఈలోగా మురుగన్‌ పారిపోయాడు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.