close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ - 9 AM

1. పాక్‌ది విద్వేష ఎజెండా: మోదీ

‘‘ఉగ్రవాదుల అడ్డా పాక్‌. వారిది విద్వేష ఎజెండా. అక్కడ నియంత్రణ లేనివారు భారత్‌పై విమర్శలు చేస్తున్నారు. భారత్‌, అమెరికా ప్రజల మధ్య హృదయపూర్వక సంబంధాలున్నాయి. హ్యూస్టన్‌ నుంచి హైదరాబాద్‌ వరకు, బోస్టన్‌ నుంచి బెంగళూరు దాకా, షికాగో నుంచి శిమ్లా వరకు, లాస్‌ ఏంజిలెస్‌ నుంచి లుధియానా దాకా మన ప్రజల మైత్రి పరిఢవిల్లుతోంది’’అని ప్రధాని మోదీ అన్నారు. హూస్టన్‌ వేదికగా జరిగిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మోదీ సంస్కరణలు భేష్‌: ట్రంప్‌

భారత్‌, అమెరికా స్వప్నాలను సాకారం చేసేందుకుగాను ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. మోదీని గొప్ప నాయకుడిగా, ప్రపంచ సేవకుడిగా ఆయన అభివర్ణించారు. ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగిస్తూ.. ‘‘మోదీ ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణలతో 30 లక్షల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించింది. 40 కోట్ల మంది బలమైన మధ్య తరగతి భారత్‌ ఆస్తి. ఈ సభకు 50 వేల మంది రావడం అత్యంత స్ఫూర్తిదాయకం’’అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. సీమకు గోదారి!

రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు వీలుగా గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే అంశంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం చర్చించనున్నారు. ఈ విషయమై సహకరిస్తామని ఇప్పటికే కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్‌ సైతం రాయలసీమ పర్యటనలో దీనిని పదేపదే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నేటి వీరి భేటీకి ప్రాధాన్యమేర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రేపు సింగరేణిలో సమ్మె

బొగ్గు పరిశ్రమలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఈ నెల 24న సింగరేణి వ్యాప్తంగా సమ్మె జరగనుంది. ఈ మేరకు నాలుగు జాతీయ కార్మిక సంఘాలు  ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్చెమ్మెస్‌ ఇటీవల ప్రకటించాయి. ఈ సమ్మెకు తమ సంఘం మద్దతిస్తోందని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగనికార్మిక సంఘం (తెబొగకాసం) ఆదివారం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. యుద్ధం వస్తే.. ప్రపంచ పటంలో పాక్‌ ఉండదు

ఈ దఫా పాకిస్థాన్‌తో యుద్ధమంటూ వస్తే.. ప్రపంచ పటంలో ఆ దేశం ఉండబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు పీవోకే సంగతీ తేలుస్తామని, విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాటాకు చప్పుళ్లకు జడిసే ప్రభుత్వం ఇక్కడ లేదని, తమకు దేశమే ముఖ్యమని, తరువాతే పార్టీ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ‘టోఫెల్‌’ లేకుండానే బ్రిటన్‌లో పనిచేయొచ్చు

బ్రిటన్‌లో సేవలందించాలనుకునే విదేశీ వైద్యులు, నర్సులకు కాస్త తీపి కబురు! ఇకపై వారు ప్రత్యేకంగా టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ వంటి ఆంగ్ల భాషా పరిజ్ఞాన పరీక్షలకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. ఆ దేశంలోని సాధారణ వైద్య మండలి (జీఎంసీ), నర్సింగ్‌-మంత్రసాని సేవల మండలి (ఎన్‌ఎంసీ)లో పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియలో భాగంగా తప్పనిసరిగా హాజరయ్యే వృత్తి విద్యా ఆంగ్ల భాషా పరిజ్ఞాన పరీక్ష (ఓఈటీ)లో సాధించే మార్కులను ఆ దేశం ఇకపై పరిగణనలోకి తీసుకోనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. హ్యూస్టన్‌లో ‘హౌడీ-మోదీ’ కార్యక్రమం

8. కశ్మీర్‌ సమస్యకు నెహ్రూయే కారణం

కశ్మీర్‌ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. జమ్మూ- కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించిన 370, 35(ఎ) అధికరణాల రద్దుపై ప్రజలకు అవగాహన కలిగించడానికి భాజపా ఆదివారం ముంబయిలో నిర్వహించిన జన జాగరణ్‌ సభలో ఆయన ప్రసంగించారు. కశ్మీర్‌ ఆక్రమణకు వచ్చిన పాక్‌ గిరిజనులపై నెహ్రూ అర్ధాంతరంగా కాల్పులు ఆపించారని, అందువల్లనే కొంత భూ భాగం వారి ఆధీనంలో ఉండిపోయిందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మేకప్‌ వేసుకుంటే నన్ను నేను మర్చిపోతా:చిరు

‘‘సైరా’లాంటి కథను సినిమాగా తీయాలంటే మొదటి నుంచి చివరి వరకూ గుర్రాలపై కత్తి యుద్ధాలు చేస్తూ ఉండాలి. ఎంతకష్టమో అది అనుభవిస్తే కానీ, తెలియదు. అయితే ఒక్కసారి మేకప్‌ వేసుకుని కత్తి, డాలు పట్టుకుని గుర్రం ఎక్కితే, నన్ను నేను మర్చిపోతా. నా వయసు మర్చిపోతాను. నాకు గుర్తొచ్చేది నా అభిమానులు, ఇమేజ్‌ మాత్రమే. 25ఏళ్ల కిందట ఏ జోష్‌ ఉందో అదే నన్ను ఆవహిస్తుంది’’ అని అన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ  చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. చివరి టీ20లో భారత్‌కు ఝలక్‌

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. జోరు కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాతో చివరి టీ20లోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో టీమ్‌ఇండియా సొంతం చేసుకుంటుందని అనుకుంటే.. ప్రత్యర్థే కోహ్లీసేనకు షాకిస్తూ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆదివారం బెంగళూరులో ఏకపక్షంగా సాగిన మూడో టీ20లో భారత్‌ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.