close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. అమెరికాలో మోదీకి ఘన స్వాగతం

వారం రోజుల కీలక పర్యటన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి అమెరికాలో అడుగుపెట్టారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.00 గంటల సమయంలో ఆయన హ్యూస్టన్‌ నగరంలోని జార్జి బుష్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అమెరికా అధికారులు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం హ్యూస్టన్‌లో ‘హౌడీ మోదీ’ పేరుతో నిర్వహిస్తున్న మెగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. 15% అధిక పరిహారం

‘ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు నింపేలా అధికారులు మానవత్వంతో పనిచేసి వరద బాధితులను ఆదుకోవాలి. పంట, ఇతర నష్టాల నమోదు సమయంలో స్వేచ్ఛగా ఉండాలి’ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన కర్నూలు జిల్లాలోని నంద్యాల డివిజన్‌ వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే ద్వారా నష్టాన్ని పరిశీలించారు. పంటలు, ఇళ్లు ఇతర నష్ట పరిహారాన్ని గతంకంటే 15% పెంచి ఇస్తామని సీఎం భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ప్రభుత్వ ఆధ్వర్యంలో సినిమా టికెట్లు

తెలంగాణలోని సినిమా థియేటర్లలో టికెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వమే వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించాలని యోచిస్తోందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) పోర్టల్‌ ద్వారా ఈ విక్రయాలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. శనివారం శాసనసభా ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

4. నిలిచిన ఆపరేషన్‌

కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగి శనివారానికి ఏడు రోజులైంది. బోటును వెలికితీయడం కష్టమేనని, సహాయచర్యలు చేపట్టేవారికి ప్రమాదం పొంచి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమవారి జాడ దొరక్క బాధితుల కుటుంబీకులు రగిలిపోతున్నారు. బోటును వెలికితీయడంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్దామంటే 144 సెక్షన్‌ పేరుతో అక్కడికీ రానీయడం లేదని మండిపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

5. పరీక్షలను మళ్లీ నిర్వహించాలి: బాబు

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయించాలని శనివారం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. 19 లక్షల మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. ప్రశ్నపత్రాల లీకేజీకి కారణమైన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని, మరోసారి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. 2020లో మరోసారి జాబిల్లియాత్ర

2020లో మరోసారి చంద్రమండల యాత్ర చేపట్టే అంశంపై ఇస్రో దృష్టిసారించిందని ఆ సంస్థ ఛైర్మన్‌ కె. శివన్‌ వెల్లడించారు. ‘‘భవిష్యత్‌ ప్రణాళికపై చర్చలు సాగుతున్నాయి. నిర్దిష్టంగా ఏదీ ఖరారు కాలేదు. వచ్చే ఏడాది జరిగే మానవరహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’పైనే ప్రధానంగా దృష్టిసారించాం’’ అని పేర్కొన్నారు. శాస్త్ర పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శన అనే రెండు అంశాల్లో చంద్రయాన్‌-2 ప్రాజెక్టు 98 శాతం విజయం సాధించిందని శివన్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. బీఏదే అగ్రస్థానం...

బ్యాచులర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (బీఏ) చదువు.. ఎందుకూ పనికిరాదని చాలామందిలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చిన్నచూపు ఉన్నా దేశంలో ఇప్పటికీ అత్యధికంగా చేరుతున్న కోర్సు ఇదే. అండర్‌గ్రాడ్యుయేట్‌ చదివే విద్యార్థుల్లో 35.9శాతం వారే ఉండటం విశేషం. అఖిల భారత ఉన్నత విద్య సర్వే(ఏఐసీహెచ్‌ఈ)- 2018-19 ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. తెలుగు రాష్ట్రాల్లో బీఏ కోర్సులకు బదులు వృత్తివిద్యా కోర్సులవైపు  మక్కువ చూపుతున్నారని, ఉత్తరభారత్‌లో మాత్రం బీఏలోనే అధికంగా చేరతున్నారని విద్యావేత్తలు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐటీ నైపుణ్యాలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నిర్ణయించింది. విద్యాబోధనను మరింత ఆకర్షణీయంగా, సమర్థంగా చేయడంతో పాటు పాఠశాల నిర్వహణ విధులను సులభతరం చేయడం వల్ల బోధనపైనే దృష్టి సారించేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు వీలవుతుందని సంస్థ పేర్కొంది. తొలుత తెలంగాణా రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతుండగా, క్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా విస్తరించాలన్నది సంస్థ ప్రణాళిక. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ‘అసందర్భ వాదనలతో ఐరాసలో కాలం వృథా’

కశ్మీర్‌ అంశాన్ని ఐరాస సర్వప్రతినిధి సభలో పాక్‌ లేవనెత్తనుందన్న వార్తలపై అక్బరుద్దీన్‌ మరోసారి స్పందించారు. సమావేశంలో సభ్యులు తమ సమయాన్ని ఎంత ప్రభావవంతంగా ఉపయోగించుకున్నారన్న ఆధారంగానే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రమాణాలకు విరుద్ధంగా అసందర్భ వాదనలతో తమ కాలాన్ని వృథా చేసుకునే నాయకులెవరైనా ఉంటే అది వారికే వదిలేస్తున్నామని పరోక్షంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి చురకలంటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రజతమే.. అయినా ఘనమే

ప్రపంచ వేదికలపై భారత క్రీడాకారులకు శనివారం మిశ్రమ ఫలితాలొచ్చాయి. కజకిస్థాన్‌లో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో దీపక్‌ పునియా (86 కేజీలు) ఫైనల్‌కు దూసుకెళ్లి సత్తా చాటగా.. రష్యా ఆతిథ్యమిస్తున్న ప్రపంచ బాక్సింగ్‌ టోర్నీలో అమిత్‌ పంగాల్‌ (52 కేజీలు) ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. టీ20 సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌ ఆదివారమే. సిరీస్‌ నెగ్గి రెట్టించిన ఉత్సాహంతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కావాలని కోహ్లీసేన భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.