close

తాజా వార్తలు

తాడుతు పాడుతూ మనువాడితే..!

 బ్రెసాఖ్‌: ఎవరి పెళ్లినైనా వర్ణించాలంటే ఏం చేస్తాం. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత అరుగు అని మొదలుపెడతాం కదా! జర్మనీలో బ్రెసాఖ్‌లో ఓ పెళ్లికి గట్టిగా కట్టిన ఇనుప తాళ్లపైనున్న ద్విచక్ర వాహనాలకు బిగించిన ఇనుప చట్రాలే వేదికయ్యాయి. వరుడి పేరు స్వెన్‌ లియర్‌, వధువు అన్నా ట్రబేర్‌. వధువు కుటుంబసభ్యులు పూర్వం నుంచి గట్టిగా కట్టిన తాళ్లపై విన్యాసాలు చేయడంలో నిష్ణాతులు. ఆ సంప్రదాయానికి కొనసాగింపు అన్నట్లుగా అన్నా శనివారం ఇలా వినూత్న రీతిలో మనసైన వాడిని మనువాడింది. వివాహ రిజిస్ట్రార్‌, మేయర్‌ ఓలివర్‌ రీన్‌ కూడా మరో తాడుకు వేలాడుతూ పెళ్లి తంతు జరిపించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.