close

తాజా వార్తలు

జిల్లాకో పాస్‌పోర్ట్‌ కేంద్రం: కేంద్రమంత్రి

రాజ్‌పిప్లా (గుజరాత్‌): దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం ఉండాలని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌ నర్మదా జిల్లాలోని రాజ్‌పిప్లాలో ఆయన పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ జిల్లాలో ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం వల్ల ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారని అన్నారు. ‘‘దేశంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గం లేదా జిల్లాలో ఒక పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం ఉండాలి. ఈ జిల్లాకు ప్రపంచవ్యాప్త పర్యాటకుల తాకిడి ఉండడం వల్ల ఇక్కడి ప్రజల జీవితాలు మారిపోతాయి. వీరికి చక్కని ఉపాధి దొరుకుతుంది. వీళ్లు ఇతర దేశాలకు విహారానికి వెళ్లే స్థితి వస్తుంది. ఇప్పటి వరకూ ఈ విగ్రహాన్ని మూడు కోట్ల మంది సందర్శించారు. ఈ విగ్రహమే ఇక్కడి ప్రజల జీవితాన్ని మార్చనుంద’’ని అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో పాలన పరంగా మోదీ అనేక మార్పులు తీసుకొచ్చారని, దీంతో ఆయన మార్పునకు చిహ్నంగా మారారని కొనియాడారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.