close

తాజా వార్తలు

చలాన్లకు బదులు హెల్మెట్‌.. కేటీఆర్‌ అభినందన

ఉప్పల్ (హైదరాబాద్‌): రాచకొండ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయత్నం చేశారు. డీజీపీ, రాచకొండ సీపీ ఆదేశాల ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వాహనదారులకు చలాన్లు విధించకుండా నిబంధనలకు అనుగుణంగా వారికి ఉండాల్సిన వాహనపత్రాలను మంజూరు చేయిస్తామని రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌రావు అన్నారు. ఉప్పల్‌ రింగ్‌రోడ్‌ వద్ద శనివారం వారి సిబ్బందితో కలిసి వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్‌ లేకుంటే అక్కడికక్కడే వాహనదారునిచేత కొనిపిస్తామన్నారు. అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ తదితర పత్రాలు లేకుంటే వెంటనే మంజూరయ్యేలా సంబంధిత విభాగాలకు సమన్వయం చేస్తామన్నారు. వాహనదారులు కూడా అన్ని నిబంధనలూ పాటించి వాహనాన్ని నడిపితే ప్రమాదాల బారిన పడకుండా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధి ట్రాఫిక్‌ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

రాచకొండ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న చిత్రాలను జతచేస్తూ అభినందనలు తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.