Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009306
            [news_title_telugu_html] => టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM
            [news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM
            [news_title_english] => FIVE PM NEWS
            [news_short_description] => తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబును గృహ నిర్బంధం చేయడంపై డీజీపీ గౌతం సవాంగ్‌ స్పందించారు. చంద్రబాబును అడ్డుకోవడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు ఆయనను అడ్డుకోలేదని

            [news_tags_keywords] => TOP NEWS, 5 PM
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-09-11 16:59:53
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM - FIVE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. చంద్రబాబును అందుకే నిర్బంధించాం: డీజీపీ

తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబును గృహ నిర్బంధం చేయడంపై డీజీపీ గౌతం సవాంగ్‌ స్పందించారు. చంద్రబాబును అడ్డుకోవడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు ఆయనను అడ్డుకోలేదని.. పల్నాడులో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందువల్లే ముందస్తుగా చంద్రబాబును నిర్బంధించినట్టు సవాంగ్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం సమీక్ష

రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం కానున్న సచివాలయాల ఏర్పాటు సన్నాహాలపై అధికారులతో సీఎం చర్చించారు. సచివాలయ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారంటూ అధికారులను జగన్‌ అభినందించారు. 4 నెలల వ్యవధిలో 4 లక్షలకుపైగా నియామకాలు చేపట్టగలిగామని అధికారులు సీఎంకు వివరించారు. ఫిర్యాదుల కోసం 1902 కాల్‌సెంటర్‌ను సిద్ధం చేస్తున్నామని అధికారులు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తాం

టీఎస్‌ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బస్‌భవన్‌ల్ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మకు సమ్మె నోటీసులు అందచేశారు. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి టీజేఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసులు ఇచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. నరేశ్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)లో మొదటి నుంచి లుకలుకలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ‘మా’ నూతన అధ్యక్షుడిగా నరేశ్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వివిధ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రాజశేఖర్‌, నరేశ్‌ల మధ్య స్నేహబంధం మరింత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్‌ వర్గం నరేశ్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. ‘మా’ అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఫరూక్‌ అబ్దుల్లా కోసం సుప్రీంకు వైగో

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా కోసం రాజ్యసభ ఎంపీ, ఎండీఎంకే అధినేత వైగో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫరూక్‌ను సంప్రదించడం కోసం న్యాయస్థానంలో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. తెదేపా శిబిరం నుంచి బాధితుల తరలింపు

గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో తెదేపా ఏర్పాటు చేసిన వైకాపా బాధితుల శిబిరంలో ఉన్నవారిని పోలీసులు స్వగ్రామాలకు తరలిస్తున్నారు. మొత్తం ఐదు గ్రామాలకుచెందిన 200 మంది ఈ శిబిరంలో ఉన్నట్టు గుర్తించారు. అయితే, ప్రతి ఊరికీ ఒక బస్సును ఏర్పాటు చేసి వారిని స్వగ్రామాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. లంక ఆటగాళ్లపై భారత్‌ ఒత్తిడి అబద్ధం

పాకిస్థాన్‌లో పర్యటించకుండా తమ ఆటగాళ్లపై భారత్‌ ఎలాంటి ఒత్తిడి చేయలేదని శ్రీలంక క్రీడామంత్రి హరిన్‌ ఫెర్నాండో తెలిపారు. 2009 ఉగ్రదాడి మూలంగానే అక్కడ పర్యటించేందుకు క్రికెటర్లు భయపడుతున్నారని పేర్కొన్నారు. లంక ఆటగాళ్లపై భారత్‌ ఒత్తిడి చేసిందన్న పాక్‌ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ ఆరోపణలను తిప్పికొట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. బల్క్‌యూజర్లకు ప్రత్యేక స్టాక్‌యార్డులు: జగన్‌

రాష్ట్రంలో ఇసుక విధానంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్షించారు. వరద తగ్గగానే ఇసుక రీచ్‌ నుంచి స్టాక్‌ యార్డులకు చేరాలని అధికారులను ఆదేశించారు. స్టాక్‌ యార్డు పాయింట్లు మరిన్ని పెంచాలని.. ఇసుక మాఫియా జరగకుండా సాంకేతిక సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రజలు ఇబ్బందిపడకుండా త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. బల్క్‌ యూజర్ల  కోసం ప్రత్యేక స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేయాలని జగన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ‘ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేలా వైకాపా పాలన’

ప్రజా సమస్యలపై వైకాపా ప్రభుత్వానికి ధ్యాస లేదని భాజపా ఎంపీ సుజనాచౌదరి విమర్శించారు. వైకాపా వందరోజుల పాలన ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకుంటున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. విజయవాడలో సుజనా మీడియాతో మాట్లాడారు. పోలవరం స్వాతంత్ర్యం రాకముందే ప్రణాళిక వేసిన ప్రాజెక్టు అని చెప్పారు. 70 ఏళ్లుగా ఆ ప్రాజెక్టును జీవనాడిగా చెప్పుకుంటున్నామన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోలవరం టెండర్ల విధానంలో తప్పు జరిగిందని.. 14 శాతం తక్కువకు కాంట్రాక్టు ఇచ్చారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మార్కెట్లు.. నేడూ ముందుకే

దేశీయ మార్కెట్లు లాభాల జోరు కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్‌ 125 పాయింట్లు లాభపడి 37,271 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 11,036 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.68గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.