Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009274
            [news_title_telugu_html] => 

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం సమీక్ష

[news_title_telugu] => గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం సమీక్ష [news_title_english] => CM Jagan Review On Village and Ward Sachivalayam Inauguration [news_short_description] => రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం కానున్న సచివాలయాల ఏర్పాటు సన్నాహాలపై అధికారులతో సీఎం చర్చించారు. సచివాలయ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారంటూ అధికారులను... [news_tags_keywords] => Jagan,AP CM,AP News [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 15:23:41 [news_isactive] => 1 [news_status] => 2 ) )
గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం సమీక్ష - CM Jagan Review On Village and Ward Sachivalayam Inauguration - EENADU
close

తాజా వార్తలు

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం కానున్న సచివాలయాల ఏర్పాటు సన్నాహాలపై అధికారులతో సీఎం చర్చించారు. సచివాలయ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారంటూ అధికారులను జగన్‌ అభినందించారు. 4 నెలల వ్యవధిలో 4 లక్షలకుపైగా నియామకాలు చేపట్టగలిగామని అధికారులు సీఎంకు వివరించారు. ప్రజాసమస్యలపై స్పందనకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక నంబర్‌ ఉండాలని జగన్‌ సూచించారు. ఫిర్యాదుల కోసం 1902 కాల్‌సెంటర్‌ను సిద్ధం చేస్తున్నామని అధికారులు చెప్పారు.

రైతుభరోసా లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయండి

ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్‌ ఉండాలని.. ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని అక్కడ క్రోడీకరించాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయానికి రాష్ట్ర సచివాలయానికి అనుసంధానం కలిగి ఉండాలని జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాలపై వాలంటీర్ల సర్వే పూర్తయిందని అధికారులు సీఎంకు తెలిపారు. రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని.. పథకాలు, లబ్ధిదారుల ఎంపికపై సామాజిక తనిఖీలు జరగాలని జగన్‌ సూచించారు. ఆయా పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని సీఎం ఆదేశించారు. ప్రకృతి, సేంద్రియ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు 237 రకాల సేవలు అందించనున్నట్లు సీఎం చెప్పారు. మరోవైపు పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్‌లోపు అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.