Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119008865
            [news_title_telugu_html] => 

పోలీసుల మానవత్వానికి సెల్యూట్‌

[news_title_telugu] => పోలీసుల మానవత్వానికి సెల్యూట్‌ [news_title_english] => Police Conduct Funeral to 80 Year Old woman [news_short_description] => ఊరు లేదు పేరు లేదు.. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడానికి మాటలు రావు. అలాంటి దయనీయ స్థితిలో ఉన్న మహిళను గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు ఆదరించారు. ఆకలని సైగ చేస్తే అన్నం పెట్టారు. అనారోగ్యం వస్తే ఆస్పత్రికి తరలించి బాగోగులు చూసుకున్నారు. తనను ఆదరించిన ..... [news_tags_keywords] => Funeral,Tadepalli Police,Ap News [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 6cQI8GtwrGc [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 00:09:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పోలీసుల మానవత్వానికి సెల్యూట్‌ - Police Conduct Funeral to 80 Year Old woman - EENADU
close

తాజా వార్తలు

పోలీసుల మానవత్వానికి సెల్యూట్‌

అమరావతి: ఊరు లేదు.. పేరు లేదు.. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడానికి మాటలు రావు. అలాంటి దయనీయ స్థితిలో ఉన్న మహిళను గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు ఆదరించారు. ఆకలని సైగ చేస్తే అన్నం పెట్టారు. అనారోగ్యం వస్తే ఆస్పత్రికి తరలించి బాగోగులు చూసుకున్నారు. తనను ఆదరించిన పోలీసులపై ఆ మహిళ సైతం అంతే అభిమానం పెంచుకుంది. అయితే తాము ఆదరించి అక్కున చేర్చుకున్న ఆమె ఇవాళ మృతి చెందటంతో పోలీసులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె పాడెమోసి అంత్యక్రియలు నిర్వహించారు.

తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు సుమారు 30ఏళ్ల క్రితం బానావత్‌ మూగమ్మ (80) అనే ఓ బదిర మహిళ వచ్చింది. ఆమెకు ఎవరూ లేరని గ్రహించిన అప్పటి పోలీసులు ఆశ్రయం కల్పించారు. ఆ మహిళ కోసం ఓ చిన్న గది ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్‌ శుభ్రం చేసి అక్కడే విశ్రాంతి తీసుకునేది. ఆమెకు కావాల్సిన ఆహారం పోలీసులే అందించేవారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పోలీసులే తమ వాహనంలో తీసుకెళ్లి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించేవారు. అయితే వృద్ధాప్యంతో ఆ మహిళ ఇవాళ మరణించింది. ఆమె మరణ వార్త విని పోలీసులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కుటుంబసభ్యులతో వచ్చి నివాళులర్పించారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.