close

తాజా వార్తలు

సీబీఐకి పల్నాడు గనుల లీజు కేసు!

అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల లీజుకు సంబంధించి తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవిగా రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సర్కార్‌ నిర్ణయించినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది హై కోర్టుకు తెలిపారు. రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. యరపతినేని అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారంటూ పిడుగురాళ్ల పట్టణానికి చెందిన కుందుర్తి గురవాచారి అనే వ్యక్తి 2015లో కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. ఇటీవల ఈ అంశంపై వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలిపింది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.