Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145154
            [news_title_telugu_html] => 

ఒంటికాలితో ఒంటరిగా 15 వేల కి.మీ

[news_title_telugu] => ఒంటికాలితో ఒంటరిగా 15 వేల కి.మీ [news_title_english] => Venezuelan man makes ‘one-legged’ trek across South America [news_short_description] => సంకల్పం ఉంటే వైకల్యం కూడా వెనకడుగు వేస్తుందని నిరూపించాడు దివ్యాంగుడు. కాలు లేకపోయినా.. దక్షిణఅమెరికా మొత్తాన్ని కాలినడకన చుట్టేసి అంగవైకల్యంతో బాధపడే వారందరిలో స్ఫూర్తి నింపాడు. అతడే వెనెజులాకు చెందిన 57 ఏళ్ల యెసైల్‌ అరాండా. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వెనెజులా నుంచి కేవలం 30 డాలర్లతో అడుగు బయటపెట్టి   [news_tags_keywords] => venezeula,south america,inspiration [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => HDHr9kFmUCU [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 00:03:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఒంటికాలితో ఒంటరిగా 15 వేల కి.మీ - Venezuelan man makes ‘one-legged’ trek across South America - EENADU
close

తాజా వార్తలు

ఒంటికాలితో ఒంటరిగా 15 వేల కి.మీ

ఇంటర్నెట్‌డెస్క్‌: సంకల్పం ఉంటే వైకల్యం కూడా వెనకడుగు వేస్తుందని నిరూపించాడు దివ్యాంగుడు. కాలు లేకపోయినా.. దక్షిణఅమెరికా మొత్తాన్ని కాలినడకన చుట్టేసి అంగవైకల్యంతో బాధపడే వారందరిలో స్ఫూర్తి నింపాడు. అతడే వెనెజులాకు చెందిన 57 ఏళ్ల యెసైల్‌ అరాండా. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వెనెజులా నుంచి కేవలం 30 డాలర్లతో అడుగు బయటపెట్టి 15వేల కిలోమీటర్ల సాహసయాత్రను పూర్తి చేశాడు. 

వెనెజులా రాష్ట్రం తచిరాలోని సాన్‌క్రిస్టోబాల్‌ యెసైల్‌ అరాండా సొంత పట్టణం. 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యెసైల్‌, ఆయన కుమార్తె పాలో ఒక్కో కాలును పోగొట్టుకున్నారు. అయితేనేం మనోస్థైర్యంతో జీవితం వెల్లదీస్తున్న యెసైల్‌ తనలా అంగవైకల్యంలో బాధపడుతున్న వారికి స్ఫూర్తి నింపి బతుకుపై ఆశలు కల్పించాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా గతేడాది బ్యాగును వీపునకు తగిలించుకొని కేవలం 30 డాలర్ల డబ్బుతో ఓ అల్యూమినియం కృత్రిమ కాలు సహాయంతో దక్షిణఅమెరికా యాత్రకు బయలుదేరారు. 57 ఏళ్ల యెసైల్‌ అరాండా దక్షిణ అమెరికా యాత్రలో అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని స్థిరంగా నిలిచాడు. గత శనివారం రోజున దక్షిణ అమెరికాలోని ఉశయ్యనగరానికి చెరారు. ఆ నగరం మొత్తం మంచు దుప్పటి కప్పుకున్న ఎత్తైన పర్వత శిఖరాలతో ఉంటుంది. అయితే యెసైల్‌ మనో నిబ్బరం ముందు ఆ శిఖరాలు తలవంచక తప్పలేదు. ఈ సాహస యాత్ర ద్వారా తనలా అంగవైకల్యంతో బాధపడుతున్నవారందరూ  స్ఫూర్తిపొంది తమ కలల సాధనవైపు వెళ్లడమే తన ఉద్దేశమని అంటారు యెసైల్‌. ఓ కాలు కోల్పోయి రెండో కాలు దెబ్బతిని చక్రాల కుర్చిలో ఇబ్బందులు పడుతున్న తన కుమార్తె పాలోకి ఈ సాహస యాత్ర ధైర్యాన్నిస్తుందని ఆశిస్తున్నట్లు యెసైల్‌ తెలిపారు. 

దక్షిణఅమెరికా మొత్తం చుట్టేయాలన్న యెసైల్‌ కలకు చిలీ అడ్డుగా నిలిచింది. వెనెజులా పౌరులకు వీసా ఇవ్వరాదన్న నిబంధన మేరకు యెసైల్‌కు కూడా వీసా లభించలేదు. ఆయన కథ గురించి టీవీల ద్వారా తెలుసుకున్న కొందరు దాతలు ఆయనకు నేరుగా ఆర్జెంటీనాకు విమాన టికెట్లు కొనిపించారు. ఈ ఘటన కూడా వెనెజులాలో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా బాధపడుతున్న తన దేశ ప్రజలకు ధైర్యాన్నిస్తుందని యెసైల్‌ అంటారు. తన 15వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది తనకు సాయం చేశారని, కొందరు అవహేళన కూడా చేశారని అయినా తాను ఏమాత్రం కుంగిపోకుండా ముందుకు సాగినట్లు చెప్పారు. తినడానికి తిండిలేని సమయంలో కొందరు ఆశ్రయమిచ్చి మరీ ఆకలి తీర్చినట్లు ఇదంతా దేవుడి కృపగా పేర్కొంటారు. ఈ 15వేల కిలోమీటర్ల ప్రయనంలో పసిఫిక్‌ తీరంలో సూర్యాస్తమయంతో పాటు చారిత్రక ఇన్‌కారోయిన్స్‌ని, పెంగ్విన్‌పక్షులతో స్నేహాన్ని చవిచూశానని చెప్పారు. తొలిసారి మంచును కూడా తాకానని తెలిపారు. తన తిరుగు ప్రయాణాన్ని కూడా అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే, బ్రెజిల్‌, గియానిస్‌ మీదుగా కాలినడకనే సాగించాలని యెసైల్‌ నిశ్చయించుకున్నారు. 
 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.