close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1PM

1. నవయుగ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందం రద్దుపై హైకోర్టులో నవయుగ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆగస్టు 14న ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషన్‌లో సదరు సంస్థ పేర్కొంది. అర్ధాంతరంగా తమ ఒప్పందాన్ని రద్దు చేయడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పిటిషన్‌లో తెలిపింది. పిటిషనర్‌ తరఫు వాదనలు విన్న హైకోర్టు విచారణను మధ్యాహ్నం 2.15గంటలకు వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వచ్చే నెల 7నవేకువజామున జాబిల్లి పైకి: శివన్‌

చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో ఈరోజు అత్యంత కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ కే.శివన్‌ ప్రయోగ వివరాలను ప్రజలకు వివరించారు. ఇక నుంచి జరగబోయే అన్ని ప్రక్రియల్ని సాంకేతిక అంశాలతో సహా వివరించారు. సెప్టెంబరు 7న వేకువజామున 1.40గంటలకు ల్యాండర్‌రో ప్రొపల్షన్‌ ప్రారంభమై 1.55గంటలకు ల్యాండ్‌ అవుతుందని తెలిపారు. అనంతరం రెండు గంటల తర్వాత ల్యాండర్‌లోని ర్యాంప్‌ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘మోదీకి ఆరెస్సెస్‌ విధానాలపై గౌరవం లేదు’

ప్రధాని నరేంద్ర మోదీకి భాజపా సిద్ధాంతకర్త ఆరెస్సెస్‌ అభిప్రాయాల పట్ల ఏమాత్రం గౌరవం లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. రిజర్వేషన్లపై ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలపై సంఘ్‌ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. సున్నితమైన అంశాలపై ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకోవాలని మాత్రమే భగవత్‌ అభిప్రాయమని వివరించింది. ఈ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన ప్రియాంక.. జమ్మూకశ్మీర్‌ లాంటి సున్నితమైన అంశంలో మోదీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని.. ప్రజల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆందోళనకర పరిస్థితుల్లో సుహృద్భావ చర్చలు

భారత ప్రధాని మోదీ, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో మాట్లాడినట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. వారితో చర్చించిన అంశాలను ట్విటర్‌లో క్లుప్తంగా పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో పాటు ద్వైపాక్షిక, వ్యూహాత్మక, వాణిజ్య అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు. ఆందోళనకర పరిస్థితుల మధ్య సుహృద్భావ మంతనాలు జరిగాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కర్ణాటకలో కొలువుదీరిన మంత్రివర్గం

ఎట్టకేలకు కర్ణాటకలో మంత్రి వర్గవిస్తరణ జరిగింది. కర్ణాటక భాజపా అధ్యక్షుడు యడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తన క్యాబినెట్‌లో 17 మందికి స్థానం కల్పించారు. అనేక నాటకీయ పరిణామాల అనంతరం కర్ణాటకలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమిని విశ్వాస పరీక్షలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన యడియూరప్ప తాజాగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. 17 మంది మంత్రులతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దేశవ్యాప్తంగా హై అలెర్ట్‌

అఫ్గానిస్థాన్‌ పాస్‌పోర్టులతో పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ సహా నలుగురు తీవ్రవాదులు గుజరాత్‌ తీరం నుంచి భారత్‌లోకి ప్రవేశించారని దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నెల మొదటి వారంలోనే వారు దేశంలోకి చొరబడినట్లు తమకు కీలక సమాచారం అందిందని కేంద్ర నిఘావర్గాలు వెల్లడించాయి. ఆ నలుగురూ ఏసమయంలోనైనా విధ్వంసక చర్యలకు తెగబడే అవకాశముందని నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఏదైనా జరగొచ్చు’ ప్రీ రిలీజ్‌ వేడుక

8. కమల్‌నాథ్‌ మేనల్లుడి అరెస్టు

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పూరీని ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. రతుల్ పూరీ, మరో నలుగురు కలిసి ‘మోసెర్‌ బేర్‌’ అనే సంస్థ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రూ.354 కోట్ల రుణాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేసినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా సీబీఐకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రతుల్‌ పూరీ, డైరెక్టర్లు నీతా పూరీ, సంజయ్‌ జైన్‌, వినీత్‌ శర్మపై అభియోగాలు దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అదుపుతప్పి గొడను ఢీకొన్న రాజ్‌ తరుణ్‌ కారు

సినీనటుడు రాజ్‌తరుణ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అతడికి తృటిలో ప్రమాదం తప్పింది. చిత్రీకరణ తర్వాత రాజ్‌తరుణ్‌ ఓ సినీ నిర్మాత కారును తీసుకొని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి అదుపుతప్పి కారు గోడను ఢీకొంది. దీంతో కారును అక్కడే వదిలి వేరే కారులో రాజ్‌తరుణ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రమాదానికి గురైన వోల్వో కారు నంబర్‌ TS 09 EX 1100గా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మంచు చరియ నుంచి తప్పించుకున్న కయాకర్లు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.