close

తాజా వార్తలు

హైదరాబాద్‌ మెట్రోలో పాము!

హైదరాబాద్‌ : మెట్రో రైలులో ఓ పాము కనిపించడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. ఈ నెల 14న దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద ఓ మెట్రో రైలులో పాము కనిపించిందని ప్రయాణికులు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ రైలు ఎల్బీనగర్‌ చేరుకున్న అనంతరం అక్కడే నిలిపివేశారు. అప్పటి నుంచి పాము కోసం ఆ రైలును మెట్రో స్టేషన్‌లోనే ఉంచి తనిఖీలు చేపట్టారు. నిన్న సాయంత్రం స్నేక్‌ సొసైటీ సభ్యులు పామును పట్టుకున్నారు. ఈ విషయాన్ని మెట్రో అధికారులు ఈరోజు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.