Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144589
            [news_title_telugu_html] => 

కొండల నెక్కి.. పాఠాలను బోధించి..

[news_title_telugu] => కొండల నెక్కి.. పాఠాలను బోధించి.. [news_title_english] => Teacher to uncover rubies in the soil [news_short_description] => ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మన్యంలో జీవనమంటేనే కత్తిమీద సాములాంటిది. ఆ ప్రాంతంలో పుట్టిపెరిగిన గిరిజనులు తప్ప బయటవారు ఆ ప్రాంతాలకు చేరుకోవాలంటే వ్యయప్రయాసలు పడాల్సిందే. ఎలాంటి రహదారి మార్గం లేని ఆ గ్రామాలకు వెళ్లాలంటే కొండలు, వాగులు దాటుకుంటూ కిలోమీటర్ల మేర నడవాల్సిందే... [news_tags_keywords] => agency students, araku, agency school [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => VirChb-FO6o [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 01:34:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కొండల నెక్కి.. పాఠాలను బోధించి.. - Teacher to uncover rubies in the soil - EENADU
close

తాజా వార్తలు

కొండల నెక్కి.. పాఠాలను బోధించి..

పాడేరు(విశాఖ): ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మన్యంలో జీవనమంటేనే కత్తిమీద సాములాంటిది. ఆ ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆదివాసీలు తప్ప బయటవారు ఆ ప్రాంతాలకు చేరుకోవాలంటే వ్యయప్రయాసలు పడాల్సిందే. ఎలాంటి రహదారి మార్గం లేని ఆ గ్రామాలకు వెళ్లాలంటే కొండలు, వాగులు దాటుకుంటూ కిలోమీటర్ల మేర నడవాల్సిందే... ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అక్కడ గిరిజన బాలలకు విద్యనందించడం కోసం ఓ యువ ఉపాధ్యాయుడు దాసుబాబు నడుంబిగించాడు. కష్టాలను ఓర్చి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్నాడు. విశాఖ మన్యంలోని గ్రామాలు కొండ, కోనల్లో విసిరేసినట్టు అక్కడక్కడుంటాయి. ఏ గ్రామానికి వెళ్లాలన్నా సరైన రోడ్డు మార్గమే ఉండదు వాగులు, వంకలు దాటుకుంటూ కాలిబాటన నడిచిపోవాల్సిందే. అలాంటి గ్రామమే విశాఖ జిల్లా పెద్దబయలు మండలంలోని జమదంగి. ఈ గ్రామానికి చేరుకోవాలంటే దాదాపు 20కిలో మీటర్ల మేర కొండలు, వాగులు దాటుకుంటూ వెళ్లాలి. బస్సులు, వాహనాలాంటివేమీ ఆ ప్రాంత ప్రజలకు తెలీదు. పాడేరు నుంచి ఉదయం 6గంటలకు ప్రయాణం మొదలుపెడితే మధ్యాహ్నం 3గంటలకు కాని ఊరు చేరలేము. ఆ గ్రామంలో ఉన్న గిరిపుత్రులకు తెలుగు భాష రాదు. కేవలం కొండ ఒడియా భాషలో మాత్రమే మాట్లాడుతారు. జమదంగిలో గిరిజన విద్యార్థుల కోసం పాఠశాల ఉన్నప్పటికీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అక్కడ విధులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు ఎవరూ ముందుకొచ్చేవారు కాదు.  అక్కడ గిరిజన బాలలకు విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2016లో ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించిన దాసుబాబుకు సర్కారు కొలువులో చేరిన మొదట్లోనే సాహసం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎంతో కష్టపడి అక్కడకి వచ్చిన యువ ఉపాధ్యాయుడికి సమస్యలే స్వాగతం పలికాయి. రాత్రయిందంటే చాలు ప్రాణాలు హరించే విష దోమలతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్థానికుల  భాష నేర్చుకుంటే తప్ప విద్యార్థులకు చదువు చెప్పలేమని తెలుసుకున్న దాసుబాబు అక్కడే ఉండి వారి వ్యవహారిక భాష మీద పట్టుసాధించి విద్యార్థులకు దగ్గరయ్యాడు. మెల్లమెల్లగా విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగించడమే కాక తెలుగుతో పాటు ఇంగ్లీష్‌ నేర్చుకునేలా వారిని తీర్చిదిద్దుతున్నాడు.
జమదంగి పాఠశాల విద్యార్థుల ప్రతిభ సామాజిక మాధ్యమాల ద్వారా అధికారుల దృష్టికి వెళ్లింది. స్వాతంత్ర్య వేడుకలకు విద్యార్థులను అరకు గ్రామానికి తీసుకురావాల్సిందిగా అధికారుల నుంచి ఆహ్వానం అందింది. ఎంతో సాహసంతో కూడిన ఆ మార్గం గుండా విద్యార్థులందరినీ తీసుకురాలేక కేవలం ఇద్దరు విద్యార్థులతో దాసుబాబు అరకు చేరుకున్నాడు. ఆ మారుమూల గ్రామం నుంచి వచ్చిన విద్యార్థుల ప్రతిభ చూసి అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఉపాధ్యాయ వృత్తిపట్ల తనకున్న అంకిత భావమే ఎన్ని కష్టాలనైనా ఓర్చి అక్కడ పనిచేసేలా పురిగొల్పుతోందని యువ ఉపాధ్యాయుడు తెలిపాడు. విద్యార్థులకు చదువుపట్ల ఉన్న ఆసక్తి తనను మరింత ఊత్సాహపరుస్తుందన్నారు. ఆధార్‌ ఆన్‌లైన్‌ సమస్యలతో విద్యార్థులకు రావాల్సిన ప్రోత్సాహకాలు అందడంలేదని దాసుబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.