Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144574
            [news_title_telugu_html] => 

ఆ ఉద్గారాల్లో భారత్‌దే ప్రథమ స్థానం

[news_title_telugu] => ఆ ఉద్గారాల్లో భారత్‌దే ప్రథమ స్థానం [news_title_english] => India largest SO2 emitter in world Greenpeace [news_short_description] => ప్రపంచంలోనే అత్యధికంగా సల్ఫర్‌డై ఆక్సైడ్‌(so2)ను వెదజల్లుతూ వాతావరణ కాలుష్యానికి గురవుతున్న దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉందని ఓ పరిశోధనలో తేలింది. గ్రీన్‌పీస్‌ అనే ఒక ఎన్‌జీవో సంస్థ ప్రపంచవ్యాప్తంగా so2ను విడుదల చేస్తున్న దేశాలపై నిర్వహించిన పరిశోధన తాలూకు నివేదికలను సోమవారం విడుదల చేసింది. [news_tags_keywords] => sulpher di oxide,green peace,nasa,analysis [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 01:33:16 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆ ఉద్గారాల్లో భారత్‌దే ప్రథమ స్థానం - India largest SO2 emitter in world Greenpeace - EENADU
close

తాజా వార్తలు

ఆ ఉద్గారాల్లో భారత్‌దే ప్రథమ స్థానం

దిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా సల్ఫర్‌డై ఆక్సైడ్‌(so2)ను వెదజల్లుతూ వాతావరణ కాలుష్యానికి గురవుతున్న దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉందని ఓ పరిశోధనలో తేలింది. గ్రీన్‌పీస్‌ అనే  సంస్థ ప్రపంచవ్యాప్తంగా so2ను విడుదల చేస్తున్న దేశాలపై నిర్వహించిన పరిశోధన తాలూకు నివేదికలను సోమవారం విడుదల చేసింది. వీటిని ఆధారంగా చేసుకుని ‘నాసా’ విశ్లేషణ చేసింది. ఓజోన్‌ మానిటరింగ్‌ ఉపగ్రహం ద్వారా చేసిన ఈ పరిశోధనలో ప్రపంచంలో భారత్‌లో 15శాతం కంటే ఎక్కువ so2 ను వెదజల్లుతున్న కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించింది. భారత్‌లో ఎక్కువగా so2 విడుదల చేస్తున్న ప్రదేశాల్లో మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి, తమిళనాడులోని నైవేలీ ఒడిశాలోని జార్సుగూడ, తాల్చేర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, గుజరాత్‌లోని కచ్, తెలంగాణలోని రామగుండం, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, కొరాడి ప్రాంతాలు ఉన్నట్లు పేర్కొంది. 

ఈ పరిణామాలతో వాతావరణ నిపుణులు థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. వాతావరణ కాలుష్యం విషయంలో ప్లాంట్లకు స్వేచ్ఛను ఇవ్వకూడదని, అలా ఇస్తే దేశ ప్రజలు ఆరోగ్యం విషయంలో అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందని అంటున్నారు. అధికంగా so2 వెదజల్లడం కారణంగా వాతావరణంలో గాలి కాలుష్యం ఏర్పడుతుందని నివేదికలు వెల్లడించాయి. ప్రధానంగా ఇది థర్మల్‌ విద్యుత్తు తయారీ కేంద్రాల్లో బొగ్గు, ఇంధనాలు మండించడం కారణంగా వెలువడుతుందని పేర్కొన్నాయి. 

వాతావరణంలో మార్పుల కారణంగా 2015లో కేంద్ర వాతావరణ శాఖ మొదటిసారి so2 విడుదల విషయంలో విద్యుత్తు కేంద్రాలకు కొన్ని పరిమితులను విధించింది. విద్యుత్తు తయారీ కేంద్రాల్లో 2017 కల్లా రెట్రోఫిట్‌ సాంకేతికతను ఉపయోగించాలని తెలిపింది. ఆ తర్వాత విద్యుత్తు శాఖ, విద్యుత్తు కేంద్రాల నిర్వాహకుల అభ్యర్థన మేరకు సుప్రీం కోర్టు ఆదేశాలతో దిల్లీ పరిధిలోని ప్లాంట్లకు కేంద్రం ఆ గడువును 2019 డిసెంబర్‌ వరకు, ఇతర ప్లాంట్లకు 2022 వరకు పొడిగించినట్లు ఎన్‌జీవో నివేదికలో పేర్కొంది. గాలి కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతి సంవత్సరం 4.2 మిలియన్‌ ప్రజలు మరణిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.