
తాజా వార్తలు
డ్రాయింగ్‌లో అనుత్తీర్ణులైన పాలిటెక్నిక్ విద్యార్థులు
వీరన్నపేట (మహబూబ్‌నగర్): ఇంటర్మీడియట్ ఫలితాల గొడవ మరిచిపోకముందే పాలిటెక్నిక్ ఫలితాల వివాదం తెరమీదకు వచ్చింది. ఫలితాలు చూసుకున్న విద్యార్థులు డ్రాయింగ్ పరీక్షలో వచ్చిన మార్కులు చూసి నివ్వెరపోతున్నారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో 900 మంది విద్యార్థులు నాలుగో సెమిస్టర్ పరీక్షలు రాయగా డ్రాయింగ్ పరీక్షలో విద్యార్థులకు 0, 1, 2, 3 మార్కులు వచ్చాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 300 మంది ఈ సబ్జెక్టులో అనుత్తీర్ణులైనట్లు సమాచారం. మహబూబ్‌నగర్ కళాశాలలోనే ఈ సబ్జెక్టులో 50 మంది విద్యార్థులకు ఇదేతరహాలో మార్కులు వచ్చినట్లు అధ్యాపకులు గుర్తించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కళాశాలకు వచ్చి అధ్యాపకులను నిలదీయగా మూల్యాంకనం సమయంలో జరిగిన పొరపాటు వల్ల సమస్య ఎదురైందని వారికి చెప్పారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు.
ఇప్పటివరకు పాలిటెక్నిక్ పరీక్షల జవాబుపత్రాలను అధ్యాపకులకు ఇచ్చి మూల్యాంకనం చేయించేవారు. ఈసారి వాటిని స్కానింగ్ చేసి ఆన్లైన్లో ఉంచితే అధ్యాపకులు మూల్యాంకనం చేసి ఆన్లైన్లోనే మార్కులు నమోదు చేసే విధానాన్ని తీసుకువచ్చారు. స్కానింగ్ సమయంలో సమస్య కారణంగా అధ్యాపకులకు డ్రాయింగ్కు సంబంధించిన వివరాలు జవాబుపత్రాల్లో లభించలేదని సమాచారం. వారికున్న పత్రాల మేరకు ఈ సబ్జెక్టులో అలా మార్కులు వేసినట్లు తెలుస్తోంది. ఇతర సబ్జెక్టుల్లోనూ మార్కుల్లో పొరపాట్లు చోటుచేసుకున్నాయని సమాచారం.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
