
తాజా వార్తలు
చంద్రగ్రహణం నేపథ్యంలో నిర్ణయం
తిరుమల: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం రాత్రి 7 నుంచి బుధవారం వేకువజామున 5 గంటల వరకు తితిదే మూసివేయనుంది. బుధవారం వేకువజామున 1.31 నుంచి ఉదయం 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఘడియలు ఉన్నాయి. గ్రహణ సమయానికి 6 గంటలకు ముందే మందిరం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. బుధవారం ఉదయం 5 గంటలకు శ్రీవారికి సుప్రభాతం సేవతో ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత స్వామివారికి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అనంతరం ఆణివార ఆస్థానం పూర్తిచేసి ఉదయం 11 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తారు.
నేటి సాయంత్రం యాదాద్రి, భద్రాద్రి ఆలయాల మూసివేత
చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం సాయంత్రం 6:30కు ఆలయం మూసి వేస్తున్నట్లు యాదాద్రి దేవస్థానం ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీ నరసింహచార్యులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 5:30కు సంప్రోక్షణ పూజలు గావించి ఆలయం తెరవనున్నట్లు చెప్పారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని సాయంత్రం 6 గంటలకు మూయనున్నట్లు ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు తెలిపారు. స్వామికి పవళింపు సేవ ఉండదన్నారు. 17న ఉదయం 5.30 గంటలకు తిరిగి ఆలయ తలుపులు తెరచి సంప్రోక్షణ పూజల అనంతరం 8.30 గంటల నుంచి దర్శనాలు కల్పిస్తారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- విచారణ ‘దిశ’గా...
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
