close

తాజా వార్తలు

అప్పటిదాకా ఆ భవనాల్ని కూల్చొద్దు:హైకోర్టు

హైదరాబాద్‌: సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేతపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. న్యాయస్థానంలో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతం ఆ భవనాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చివేయబోమని హామీ ఇవ్వాలని ధర్మాససనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ అన్నారు. దీంతో కేసును హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

ఇది ప్రజా విజయం: విశ్వేశ్వర్‌రావు
దీనిపై పిటిషనర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. కొత్త భవనాలతో ప్రజాధనం వృథా అవుతుందన్నారు. ఈ అంశంపై సుమారు మూడు గంటల పాటు వాదనలు సాగాయని చెప్పారు. ప్రభుత్వం దీనిపై కౌంటర్‌ వేసిందని.. తామూ వేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం విశాలంగా ఎంతో బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ కమిటీ అయినా సచివాలయ భవనం పనికిరాదని నివేదిక ఇచ్చిందా? అని తమ పిటిషన్‌లో ప్రశ్నించినట్టు చెప్పారు. కేసు తేలేంత వరకు భవనాలు కూల్చొద్దని హైకోర్టు ఆదేశాలివ్వడాన్ని ఆయన ప్రజా విజయంగా అభివర్ణించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.