close

తాజా వార్తలు

మధ్యప్రదేశ్‌ హైకోర్టులో అగ్నిప్రమాదం

భోపాల్‌: జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టులో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ ప్రమాదంలో హైకోర్టు భవనంలోని ఓ గదిలో ఉంచిన పాతసామగ్రి అంతా కాలి బూడిదైంది. ప్రమాదం జరిగిన అరగంటలోనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మంటల తీవ్రత పెరిగిపోవడంతో అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.