close

తాజా వార్తలు

‘ఉచిత ప్రయాణం.. తప్పుదోవ పట్టించడమే’

దిల్లీ: రాజధాని నగరంలో మెట్రో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు దిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించడంపై భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించింది. ఎన్నికల వేళ ఆప్‌ ప్రభుత్వానికి భయం పట్టుకోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ దిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఆలోచనను తాము వ్యతిరేకించడం లేదని, కానీ ఎన్నికలకు కేవలం ఐదారు నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 52 నెలల తర్వాత ఇప్పుడు ఈ విషయం గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంతో మహిళల భద్రత కోసం బస్సుల్లో మార్షల్స్‌ను నియమిస్తామని, ప్యానిక్‌ బటన్‌ ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చిన విషయాన్ని తివారీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అవేమీ చేయకుండా ఇప్పుడు కొత్త నాటకానికి కేజ్రీవాల్‌ తెరతీశారని విమర్శించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.