close

తాజా వార్తలు

మెట్రో రైలు డోర్‌లో చీర ఇరుక్కొని.. 

దిల్లీ: దిల్లీలోని మోతీనగర్‌ మెట్రో స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. దిల్లీలోని శాస్త్రి నగర్‌కు చెందిన గీత అనే మహిళ రైలు దిగుతున్న సమయంలో ఆమె చీర ట్రైన్‌ తలుపులో చిక్కుకుంది. వెంటనే రైలు ముందుకు కదిలి ఆమెను ఫ్లాట్‌ఫాంపై ఈడ్చుకొని వెళ్లిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన మిగతా ప్రయాణికులు అత్యవసర మీటను నొక్కగా ట్రైన్‌ ఆగి, ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనలో మహిళ తలకు గాయాలయ్యాయి. ‘ గీత, నా కూతురు నొయిడా నుంచి మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. మోతీనగర్‌ స్టేషనులో రైలు దిగే సమయంలో ఆమె చీర ట్రైన్‌ తలుపుల్లో చిక్కుకుంది. వెంటనే కదిలిన ట్రైన్‌ ఆమెను కొంతదూరం లాక్కొని వెళ్లిపోయింది. దీన్ని గుర్తించిన మిగతా ప్రయాణికులు అత్యవసర బటన్‌ను నొక్కగా రైలు ఆగింది. ఈ ప్రమాదంలో గీత తలకు గాయాలయ్యాయి. నా కూతురు ఈ ఘటనపై ఫోన్‌ ద్వారా నాకు సమాచారమిచ్చింది’ అని బాధితురాలి భర్త జగదీశ్‌ ప్రసాద్ తెలిపారు. మోతీనగర్‌ స్టేషనులో ఈ ప్రమాదం జరిగినట్లు దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎమ్‌ఆర్‌సీ) సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ ఘటన వల్ల మోతీనగర్‌, రాజేంద్ర ప్లేస్‌ స్టేషన్ల మధ్య మెట్రో సర్వీసులకు కాస్త అంతరాయం ఏర్పడిందని డీఎమ్‌ఆర్‌సీ ట్విటర్ ద్వారా వెల్లడించింది. దిల్లీలోని ద్వారకా స్టేషను నుంచి నొయిడా ఎలక్ట్రానిక్‌ స్టేషను వరకు దిల్లీ మెట్రో రైలు మార్గం ఉంది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.