close

తాజా వార్తలు

మెట్రో విద్యుత్‌లైన్‌పై ఫ్లెక్సీ.. నిలిచిన రైళ్లు

హైదరాబాద్‌: ఈదురుగాలులు, వర్షానికి ఓ పెద్ద ఫ్లెక్సీ మెట్రో 25 కేవీ విద్యుత్‌ సరఫరా వైర్లపై పడటంతో మెట్రో రైళ్లు అరగంటపాటు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో అమీర్‌పేట-నాగోలు మెట్రో మార్గంలోని బేగంపేట- అమీర్‌పేట స్టేషన్ల మధ్య విద్యుత్‌లైన్‌పై ఫ్లెక్సీ పడింది. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణిస్తున్న మెట్రో అమీర్‌పేట్‌ బేగంపేట మధ్యలో 5 నిమిషాలపాటు నిలిచిపోయింది. ఆగుతూ..ఆగుతూ రైలు బేగంపేటకు చేరుకుంది.  ప్యారడైజ్‌ స్టేషన్‌కు చేరగానే పూర్తిగా ఆపేశారు. 20 నిమిషాల పాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం మెట్రో ఇంజినీర్లు శ్రమించి ఫ్లెక్సీని తొలగించారు. దీంతో యథావిధిగా రైళ్లను పునరుద్ధరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.