close

తాజా వార్తలు

రూ.75కే మెట్రోరైలు స్మార్ట్‌కార్డు

ఉగాది కానుకగా ప్రకటించిన ఎల్‌ అండ్‌టీ మెట్రో

హైదరాబాద్‌ : మెట్రోరైలులో రాకపోకలు సాగించే వారికి ఉగాది కానుక... ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ స్మార్ట్‌ కార్డు ధరను తగ్గించింది. ఈ కార్డును ఇప్పుడు రూ.75కే కొనుగోలు చేయవచ్చు. మూడు నెలల వరకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో రూ.50 వరకు ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. నగదు అయిపోగానే కనీసం రూ.50, గరిష్ఠంగా 3వేల వరకు రీఛార్జ్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఇప్పటివరకు కార్డు కోసం రూ.150 చెల్లించాల్సి వచ్చేది. ఈ మొత్తంలో రూ.20 తిరిగి చెల్లించరు. మిగతా మొత్తం ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు 6 లక్షలపైగా కార్డులను మెట్రో విక్రయించింది. నిత్యం ప్రయాణించే 2.20 లక్షల మందిలో 1.50 లక్షల మంది వరకు  వినియోగిస్తున్నారు. ధర తగ్గించడంతో వీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.