close

తాజా వార్తలు

డేటా వివాదంపై హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌

కేసును కొట్టివేయాలని కోరిన ఐటీగ్రిడ్స్‌ సీఈవో

హైదరాబాద్‌: డేటా వివాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై గత కొంతకాలంగా జరుపుతున్న విచారణను నిలిపివేయాలని, కేసును కొట్టివేయాలని ఆ సంస్థ సీఈవో అశోక్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మాదాపూర్‌లో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా.. దీనిపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని, అప్పటివరకు ఈ కేసు విచారణను నిలిపివేస్తూ  మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అశోక్‌ కోరినట్టు తెలుస్తోంది. ఈ పిటిషన్‌ శనివారం లేదా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పిటిషన్‌లో తెలంగాణ పోలీసులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.తాము ఎలాంటి డేటా దుర్వినియోగానికి పాల్పడలేదని, వ్యాపారపరమైన లావాదేవీలు మాత్రమే చేసినట్టు అశోక్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నట్టు సమాచారం.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.