close

తాజా వార్తలు

ఆ మార్గంలో ఆరు నిమిషాలకో మెట్రో  

ఆ మార్గంలో ఆరు నిమిషాలకో మెట్రో

 

ఈనాడు, హైదరాబాద్‌: మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మెట్రో మార్గానికి ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా స్టేషన్లలో ఎక్కువసేపు ప్రయాణికులు రైలు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ మార్గంలో రైల్‌ ఫ్రీక్వెన్సీలో ఎల్‌ అండ్‌ టీ-మెట్రో తాజాగా మార్పులు చేసింది. ఆరు నిమిషాలకు ఒక మెట్రోరైల్‌ నడపనున్నారు. ఫలితంగా ఎదురుచూసే సమయం ప్రయాణికులకు చాలావరకు తగ్గింది. ప్రయాణ వేళల్లో మార్పులు ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ప్రయాణం ఇలా.. 
మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలో గతంలో రద్దీవేళలైన ఉదయం 8 నుంచి 12 మధ్య ఆరున్నర నిమిషాలకు ఒక మెట్రో నడవగా ఇప్పుడు 6 నిమిషాలకు, సాయంత్రం 5 నుంచి 9 మధ్య గతంలో 8 నిమిషాలకు ఒకటి నడవగా ఇప్పుడు 7 నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నారు. 
* నాగోల్‌ -అమీర్‌పేట మార్గంలో ఇదివరకు మాదిరే రద్దీవేళల్లో ఆరున్నర నిమిషాలకు, మిగతా సమయాల్లో 8 నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నారు. 
* అత్యంత రద్దీ సమయాల్లో అవసరం మేరకు అప్పడప్పుడు మూడున్నర నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నారు. 
* జనవరి 1 నుంచి నాంపల్లిలో మొదలయ్యే నుమాయిష్‌ రద్దీని తట్టుకునేందుకు మెట్రో సన్నద్ధమవుతోంది. అవసరమైతే ఫ్రీక్వెన్సీలో మరిన్ని మార్పులు చేయనున్నారు. నాంపల్లి స్టేషన్‌లో ప్రత్యేక టికెట్‌ కౌంటర్లను ఏర్పాట్లు చేయాలని ఇది వరకే నిర్ణయించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.