close

తాజా వార్తలు

‘పోలవరం ఆపేసే పరిస్థితికి తీసుకొచ్చారు’

తణుకు: సంపద సృష్టించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా హయాంలో ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం.. దేశంలోనే కొత్త ఒరవడి సృష్టించిందని గుర్తు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  వైకాపా అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే పరిస్థితి తారుమారైందన్నారు. ‘‘ సంపద సృష్టించకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుంది. సంపదసృష్టి వల్ల ఉపాధి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మళ్లీ ఆ ఆదాయన్ని సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి.  కానీ ఇవాళ అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతోంది.. పాలన కనిపించడం లేదు. రాష్ట్ర జీవ నాడీ పోలవరం ప్రాజెక్టు  ఆపేశారు.. డిసెంబర్‌లో నీళ్లు వదలాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేశాం. అహర్నిశలు శ్రమించి 71 శాతం పూర్తి చేశాం. 29 శాతం పనులు చేయడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. పోలవరం ఆపేసే పరిస్థితి తీసుకొచ్చారు. రివర్స్ టెండర్ అంటూ మొదటికే మోసం తెచ్చారు. జగన్ మూర్ఖత్వం వల్ల పొలవరం ఆగిపోనుంది. రాష్ట్రానికి తీవ్ర స్థాయిలో నష్టం తెచ్చారు. దశాబ్దాల ప్రజల కలను కల్లలు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది’’ అని విమర్శించారు. నియోజక వర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమీక్షలు చేసుకొని పార్టీ బలోపేతానికి దశ, దిశ చేపడుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.