
తాజా వార్తలు
గుంటూరు: ఏపీ ప్రభుత్వంపై తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. వైకాపా సర్కార్ అధికారంలోకి వచ్చాక విపక్షాలపై అక్రమ కేసులు, దాడులు సర్వసాధారణ మయ్యాయని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో పల్నాడు ప్రాంతానికి చెందిన వైకాపా బాధితులతో మాజీ ఎమ్మెల్యే యరపతినేనితోపాటు ఆయన సమావేశమయ్యారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇలాంటి అరాచక పరిస్థితులు లేవని, ఆ సమయంలో తాము కూడా దాడులకు పాల్పడితే ఈ పాటికి వైకాపా కనుమరుగయ్యేదని నక్కా వ్యాఖ్యానించారు. చింతమనేని, కోడెల, యరపతినేని వంటి ముఖ్యనేతలపై కేసులు పెట్టి వేధించారని ఆయన ఆరోపించారు. బెదిరింపులతో ఎంతకాలం పరిపాలన సాగిస్తారని.. ఈ అరాచకాలకు భవిష్యత్తులో తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వైకాపా ప్రభుత్వం ఆరిపోయే దీపం: యరపతినేని
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ... వైకాపా చేతికి కొత్తగా అధికారం రావడంతో ఆ పార్టీ నేతలు అహంకారంతో విర్రవీగుతున్నారని విమర్శించారు. పోలీసుల సాయంతో ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. వైకాపా ప్రభుత్వాన్ని ఆరిపోయే దీపంగా ఆయన అభివర్ణించారు. ఇప్పుడు జుట్టు పట్టుకున్న వాళ్లు రాబోయే రోజుల్లో కాళ్లు పట్టుకోవాల్సిందేనని యరపతినేని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకాపా బాధితులకు పార్టీ తరఫున రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
