close

తాజా వార్తలు

‘ధరలు తగ్గుతున్నా..జే-ట్యాక్స్‌ పెంచుతున్నారు’

తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు

తణుకు: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన మొత్తం స్తంభించిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తెదేపాకు పేరొస్తుందనే అక్కసుతో తమ హయాంలో కట్టిన ఇళ్లకు సైతం గృహప్రవేశం చేయడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు.  ఆర్థిక మాంద్యంతో అన్ని వస్తువులపై ధరలు తగ్గుతున్నా.. జే-ట్యాక్స్‌ మాత్రం పెంచుతున్నారని ఎద్దేవా చేశారు. పీపీఏల విషయంలో మనపై బురద చల్లాలని చూశారని ఆయన విమర్శించారు. సీఎం జగన్‌ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నదుల అనుసంధానం చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారంటే అదీ తమపై ఉన్న విశ్వసనీయత అని చెప్పారు. వర్షాలు పడటం కూడా తమ చలవే అని వైకాపా నేతలు అంటున్నారని.. జలాశయాలు, కాల్వలు మాత్రం నింపలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. 

తాటాకు చప్పుళ్లకు మా కార్యకర్తలు భయపడరు

‘‘తెదేపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు వైకాపా రంగులు వేసి మసి పూసి మారేడు కాయ చేస్తున్నారు. చింతమనేని ప్రభాకర్‌పై తప్పుడు కేసులు పెట్టారు. వివేకానంద రెడ్డిని చంపినవారిపై చర్యల్లేవు. చింతమనేనిపై మాత్రం కేసులు పెడుతున్నారు.  సీఎం జగన్ అరాచకాలు రాష్ట్రంలో సాగ నివ్వం. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ యాక్ట్ పెట్టి తెదేపా సభలు, కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు నన్నే ఇబ్బందులు పెట్టారు. నన్ను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు ఆంక్షలు పెడుతున్నారు. ప్రజావేదిక కూల్చి అరాచకాలకు నాంది పలికారు. జగన్ సొంత ఇంటి కోసం రూ.15 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. తాటాకు చప్పుళ్లకు తెదేపా కార్యకర్తలు భయపడరు. ప్రజాసేవ కోసం ఎన్ని పోరాటాలు, త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై కేసులు పెట్టి ఆయన్ను అవమానించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. బెంగళూరుకు ఇసుక తరలిస్తున్నారు. మాఫియా రాజ్యమేలుతోంది. విమర్శలు చేస్తే.. కేసులు పెడుతున్నారు. ఓ మంత్రి వెంకటేశ్వరస్వామితో పరాచకాలు ఆడుతున్నారు. ఇసుక కొరతతో అభివృద్ది ఆగింది. ఇసుక కొరతతో 50 మంది కార్మికులు మృతి చెందారు’’ అని చంద్రబాబు ఆరోపించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.