
తాజా వార్తలు
ముంబయి: సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్డీయే పక్షాలు నేడు సమావేశం కానున్నాయి. అయితే మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపా-శివసేన మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. దీంతో నేడు జరగబోయే ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తేల్చి చెప్పారు. ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రేతో భేటీ అనంతరం ఆయన శనివారం ఈ ప్రకటన చేశారు. ఎన్డీయే ఎవరి సొత్తు కాదని.. కూటమి స్థాపనలో అకాళీదళ్, శివసేన సమాన పాత్ర పోషించాయన్నారు. అలాగే కూటమి తరఫున కూడా తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు అధికారికంగా ప్రకటించడమే తరువాయా అన్న విలేకరుల ప్రశ్నపై స్పందిస్తూ.. ‘అలా అనుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు’ అని వ్యాఖ్యానించారు. మరో సేన ఎంపీ మాట్లాడుతూ.. ఆదివారం పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వర్ధంతి ఉన్నందున ఎన్డీయే సమావేశానికి ఎలా హాజరువుతామని వ్యాఖ్యానించడం గమనార్హం.
రానున్న ముంబయి, థానే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థుల్ని రంగంలోకి దించుతామని సంజయ్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య ఇప్పటికే ఓ అవగాహన కుదిరిందని.. ఇక దిల్లీ స్థాయిలో చర్చించాల్సిన అవసరం కూడా లేదన్నారు.
ఎన్డీయే కూటమిలో శివసేన సుదీర్ఘ కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిని సమానంగా పంచుకునే విషయమై భాజపాతో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తమ మంత్రి అరవింద్ సావంత్‌తో రాజీనామా చేయించారు. అదే క్రమంలో ఎన్డీయే నుంచి కూడా బయటకు వస్తారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో సేనకు ప్రాతినిధ్యం లేదు. దీంతో సోమవారం నుంచి జరిగే పార్లమెంట్‌సమావేశాల్లో శివసేన ఎంపీలు కూర్చునే స్థానాల్లో మార్పు ఉండే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాల సమాచారం.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
