close

తాజా వార్తలు

తెదేపా నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్‌

అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెదేపా నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. షోకాజ్‌ నోటీసు ద్వారా వంశీ వివరణ కోరనున్నారు. గురువారం వంశీ మీడియా సమావేశం నిర్వహించిన త్వరలో వైకాపాలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా ప్రభుత్వానికి తాను బేషరతు మద్దతు ఇస్తానని, సీఎం జగన్‌ చేస్తున్న మంచి పనులకు అండగా ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో వంశీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.