
తాజా వార్తలు
అమరావతి: ఏపీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల బియ్యం కార్డులు కలిగిన వారితోపాటు వైఎస్ఆర్ పింఛన్ కార్డు, జగనన్న విద్య అర్హత ఉన్న కుటుంబాలూ ఈ పథకానికి అర్హులుగా తెలిపింది.
మరోవైపు ఇతర కుటుంబాలకు వర్తించే ప్రమాణాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. 12 ఎకరాల కన్నా తక్కువ మాగాణీ లేదా.. 35 ఎకరాల కన్నా తక్కువ మెట్ట భూమి ఉన్న భూ యజమానులూ ఈ పథకానికి అర్హులే. మాగాణీ, మెట్టభూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువగా ఉన్న వారందరూ ఈ పథకం పరిధిలోకి వస్తారు. వీరితోపాటు ప్రభుత్వ రంగంలో పని చేస్తూ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. కుటుంబంలో ఒక కారు ఉన్నవారికీ ఈ పథకం వర్తించనుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
