
తాజా వార్తలు
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలనుద్దేశించి.. ‘‘క్రికెట్లో, రాజకీయాల్లో ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చని’’ వ్యాఖ్యానించారు. క్రికెట్లో అనేకపార్లు మ్యాచ్ ఓడిపోతామని అంచనా వేస్తామని కానీ, తుది ఫలితం మరోలా ఉంటుందన్నారు. తాను ఈ మధ్య దిల్లీ రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండడం వల్ల మహారాష్ట్రలో విషయాలపై పెద్దగా సమాచారం లేదన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. అభివృద్ధి పనులు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. భాజపాయేతర ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి ప్రాజెక్టులు కేంద్ర సహకారం లభిస్తుందని హామీ ఇచ్చారు.
మహారాష్ట్రలో ఇటీవల రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. ఇచ్చిన గడువులోగా ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదని గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. 288 స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలిచాయి. అధికారం చేపట్టడానికి కావాల్సిన 145 స్థానాలు ఏ పార్టీకీ రాకపోవడంతో సంకీర్ణం అనివార్యమయింది. కానీ, గవర్నర్ ఇచ్చిన గడువులోగా ఏ పార్టీ ఇతర పక్షాల మద్దతు కూడగట్టలేకపోయాయి. ప్రస్తుతం ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
